గర్భధారణ సమయంలో పాదాల్లో కొంచెం వాపు సాధారణ విషయమే-ప్రత్యేకించి, రోజంతా నిల్చుని పనిచేసే మహిళలకు ఈ సమస్య తప్పదు.
ఈ పరిస్థితి నివారించడానికి ఏం చేయాలి:
పగటిపూట వీలైనంత తరచుగా మీ పాదాలు పైకి లేపాలి.
విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, మీ ఎడమ వైపుగా తిరిగి పడుకోండి.
మీ పాదాలు ఎక్కువ వాపుతో ఉంటే లేదా మీరు ఉదయం మేల్కొనే సమయానికే మీ పాదాల్లో వాపు ఉంటే లేదా మీ చేతులు మరియు ముఖం కూడా ఉబ్బినట్లుగా ఉంటే, గర్భధారణ సమయంలో ప్రమాదానికి అవి సంకేతాలు. ఆరోగ్య కార్యకర్త వద్దకు లేదా ఆసుపత్రికి వెళ్లండి.