గర్భధారణ సమయంలో నేనెలా ఆరోగ్యంగా ఉండగలను

From Audiopedia
Jump to: navigation, search

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటే, మీ గర్భధారణ సురక్షితంగా ఉంటుంది మరియు మీకు సుఖ ప్రసవం జరిగి, ఆరోగ్యవంతమైన శిశువు జన్మించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

తగినంత పోషకాహారం తినడానికి ప్రయత్నించండి. మంచి పోషకాహారం బలాన్ని ఇస్తుంది, ఇన్ఫెక్షన్లు నిరోధిస్తుంది, గర్భంలోని శిశువు ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుంది మరియు ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం నివారించడంలో సహాయపడుతుంది. మీరు మీకోసం మరియు మీ కడుపులో బిడ్డ కోసం కూడా తింటున్నారని గుర్తుంచుకోండి. మీ శిశువులో మానసిక మందగమనం రాకుండా ఉండటానికి అయోడైజ్డ్ ఉప్పు ఉపయోగించండి.

చక్కగా నిద్రపోండి మరియు బాగా విశ్రాంతి తీసుకోండి. మీరు నిలబడి పనిచేసేవారైతే, రోజులో అనేకసార్లు కూర్చోవడానికి లేదా పడుకోవడానికి ప్రయత్నించండి. మీ రోజువారీ పనులు చేసినప్పటికీ, మీకు వీలైనప్పుడల్లా విశ్రాంతి తీసుకోండి.

మీకు ఎలాంటి సమస్యలు లేవని నిర్ధారించుకోవడానికి మరియు సమస్యలు తీవ్రంగా మారడానికి ముందే వాటిని గుర్తించడానికి ప్రినేటల్ (ప్రసవానికి ముందు) పరీక్షలకు వెళ్లండి. మీరు అప్పటివరకు ధనుర్వాతం ఇమ్యునైజేషన్ చేయించుకోకపోతే, మీకు వీలైనంత త్వరగా దాన్ని తీసుకోండి. గర్భధారణ ముగిసే లోపు కనీసం 2 సార్లు తీసుకోండి.

'గర్భధారణ సమయంలో ప్రమాద సంకేతాలు' గురించి చదవడం ద్వారా, ఏయే సందర్భాల్లో ఆరోగ్య కార్యకర్తను కలవాలో తెలుసుకోండి.

శుభ్రత పాటించండి. స్నానం చేయండి లేదా క్రమం తప్పకుండా కడుక్కోండి మరియు ప్రతిరోజూ మీ దంతాలు శుభ్రం చేసుకోండి.

బిగదీసే వ్యాయామాలు సాధన చేయండి. తద్వారా, ప్రసవం తర్వాత కూడా మీ యోని బిగుతుగా ఉంటుంది.

రోజువారీ వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. మీరు కూర్చుని పనిచేసేవారైతే, ప్రతిరోజూ కొంచెం నడవడానికి ప్రయత్నించండి. కానీ, మీరు అలసిపోకుండా ఉండే ప్రయత్నం చేయండి.

మీకు లైంగికం సంక్రమించిన ఇన్ఫెక్షన్ (STI) లేదా ఇతర ఇన్ఫెక్షన్ ఉందనుకుంటే, అవసరమైన చికిత్స పొందండి.

HIV పరీక్ష చేయించుకోండి. గర్భధారణ సమయంలో మీరు సంభోగంలో పాల్గొన్నప్పుడు కండోమ్ ఉపయోగించడం ద్వారా, HIV సంక్రమణను నివారించండి.

మీరు గర్భవతి అని తెలిసిన ఆరోగ్య కార్యకర్త సూచిస్తే తప్ప, ఆధునిక లేదా మూలికా ఔషధాలు తీసుకోకోండి.

గర్భధారణ సమయంలో మద్యం లేదా పొగ త్రాగవద్దు లేదా పొగాకు నమలవద్దు. అవి తల్లికి హానికరం మరియు కడుపులో పెరుగుతున్న బిడ్డకు హాని కలిగించవచ్చు.

మీరు నివసించే ప్రదేశంలో మలేరియా ఉంటే, దోమ కాటుకి గురికాకుండా ఉండటానికి దోమల వల లోపల నిద్రించండి.

పురుగుమందులు, కలుపు సంహారకాలు లేదా ఫ్యాక్టరీ రసాయనాలకు దూరంగా ఉండండి. కడుపులో పెరుగుతున్న శిశువుకి అవి హాని కలిగించవచ్చు. వాటిని తాకవద్దు లేదా వాటికి దగ్గరగా పని చేయవద్దు లేదా వాటి పొగలు పీల్చవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి కంటైనర్లలో ఆహారం లేదా నీళ్లు నిల్వ చేయవద్దు.

శరీరమంతటా దద్దుర్లతో ఉన్న పిల్లల నుండి దూరంగా ఉండండి. అది జర్మన్ మీజిల్స్ కావచ్చు. అది మీ కడుపులో బిడ్డకి హాని కలిగించవచ్చు.

Sources
  • Audiopedia ID: tel010704