అత్తమామలతో సాధారణంగా ఎలాంటి విభేదాలు వస్తాయి

From Audiopedia
Revision as of 15:17, 17 October 2024 by Marcelheyne (talk | contribs) (XML import)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

అనేక దేశాల్లో, ఒక మహిళ వివాహం చేసుకున్న తర్వాత, ఆమె తన పుట్టింటిని విడిచిపెట్టి, తన భర్త కుటుంబంతో కలిసి జీవించాల్సి వస్తుంది. చాలామంది యువతులకు ఈ పరిస్థతి చాలా బాధలు కలిగిస్తుంది. ఎందుకంటే, పెళ్లి పేరుతో వాళ్లు తమ తల్లిదండ్రులు మరియు తోబుట్టువులకి దూరం కావడమే కాకుండా ఒంటరిగా మరియు భర్త కుటుంబంలో మద్దతు లేకుండా జీవిస్తున్నట్టు భావిస్తారు.

పేదరిక మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆచారం మరియు అలవాటు కారణంగా, తరచుగా పెద్ద కుటుంబాలు ఒకే ఇంట్లో కలిసి జీవించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి, కొత్తగా పెళ్లైన జంటలు వారి తల్లిదండ్రులు మరియు అత్తమామల సాంప్రదాయ విలువలు మరియు ఆచారాలకు అనుగుణంగా జీవించాల్సి వస్తుంది.

ఈ పరిస్థితుల్లో, కొత్తగా ఇంటికి వచ్చిన యువతి జీవితాన్ని అత్తమామలు మరింత కష్టాలతో నింపేస్తుంటారు మరియు భర్తతో ఆమె బంధంలోనూ వాళ్లు జోక్యం చేసుకోవచ్చు. సాధారణంగా కనిపించే బంధంలో జోక్యానికి కొన్ని విలక్షణమైన ఉదాహరణలు:

  • కొత్త పెళ్లికూతురు వాళ్లకి చాలా సేవలు చేయాల్సి ఉంటుంది మరియు వారి అవసరాలు తీర్చాల్సి ఉంటుంది.
  • అత్తమామలకు ఆ పెళ్లి ఇష్టం లేకపోతే, వాళ్లు తమ కోడలిని బాగా చూసుకోకపోవచ్చు. కొత్త కోడలు మగ పిల్లల్ని కనకపోతే లేదంటే ఆమె ద్వారా వారి కుటుంబానికి గౌరవం దక్కకపోతే, అత్తమామలు ఆమె మీద చాలా ఒత్తిడి తీసుకురావచ్చు.
  • కొత్తగా పెళ్లైన వ్యక్తి తన భార్యను చాలా చిన్న ఇంట్లో కాపురానికి తీసుకువస్తే, ఆమె కోసం ఆ ఇంట్లో చాలా తక్కువ స్థలం అందుబాటులో ఉండవచ్చు మరియు ఆమె కోసం అందుబాటులో ఉండే ఆహారం మరియు ఇతర అవసరాలను కూడా అత్తమామలు పరిమితం చేయవచ్చు.
  • క్రింది విధంగా కూడా కోడలి మీద అత్తమామలు దుర్మార్గంగా వ్యవహరించవచ్చు:

వాళ్లు ఆమెను దూషించడం లేదా అవమానించడం ద్వారా ఆమెపై దాడి చేయడం ద్వారా ఎవరినీ కలవకుండా ఆమెని నిషేధించడం ద్వారా తల్లిదండ్రుల ఇంటి నుండి వచ్చిన వారితో మాట్లాడేందుకు ఆమెని అనుమతించకపోవడం ద్వారా పిల్లల్ని కలవడానికి సైతం ఆమెని అనుమతించకపోవడం ద్వారా

Sources
  • Audiopedia ID: tel021014