మంచి విద్య మరియు శిక్షణ కోసం నేనెందుకు కృషి చేయాలి
From Audiopedia
మీ గురించి మీరు సగర్వంగా భావించడానికి, మెరుగైన జీవితం అందుకోవడానికి మరియు సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి విద్య మీకు సహాయపడుతుంది. చాలామంది బాలికల విషయంలో విద్య మెరుగైన భవిష్యత్తుకు తలుపులు తెరుస్తుంది. మీరు పాఠశాలకు వెళ్లలేకపోయినప్పటికీ, చదవడం మరియు నైపుణ్యాలు పెంపొందించుకోవడం, నేర్చుకోవడం కోసం ఇతర మార్గాలు ఉన్నాయి.
ఉదాహరణకు, మీరు ఇంట్లోనే చదువుకోవచ్చు, అక్షరాస్యతా కార్యక్రమంలో చేరవచ్చు లేదా నైపుణ్యం కలిగిన వ్యక్తి వద్ద (అప్రెంటిషిప్) వ్యాపారం నేర్చుకోవచ్చు. మీకు కొత్త నైపుణ్యాలు ఉన్నప్పుడు, మీ సమాజానికి అందించే ప్రత్యేకత మీకు ఉంటుంది. అలాగే, మీకు మరియు మీ కుటుంబానికి కూడా మీరు మెరుగైన మద్దతు ఇవ్వగలరు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడమనేది మీ జీవితంలో మీరు మరిన్ని ఎంపికలు కలిగి ఉండడంలో మీకు సహాయపడుతుంది.