వయసు మీద పడిన మహిళలు ఆత్మహత్య చేసుకోవాలనుకోవడానికి కారణమేమిటి
From Audiopedia
అనేక దేశాల్లో వృద్ధుల్లో (65 ఏళ్లు దాటిన వాళ్లలో) ఆత్మహత్యల రేటు బాగా పెరిగింది.
దీనికి కారణం కాగల అంశాలు:
అనేక దేశాల్లో (ఆధునీకరణ కారణంగా) సాంప్రదాయ విలువలు మరియు నిబంధనలు త్వరగా దెబ్బతింటున్నాయి. వృద్ధులను గౌరవించి, అభినందించడానికి బదులుగా, కొన్ని సమాజాల్లో వారిని అనవసర భారంగా చూస్తుంటారు. వాళ్ల సంరక్షణను ఒక అసౌకర్యంగా భావిస్తుంటారు. ఈ అగౌరవం తట్టుకోలేని పరిస్థితుల్లో, చాలా మంది వృద్ధులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. తాము ఇకపై తమ కుటుంబానికి, సమాజానికి భారం కాకూడదని వాళ్లు భావించడమే అందుకు కారణం.