సెక్స్ లేకుండానే నేను ఏవిధంగా సంబంధం కొనసాగించవచ్చు

From Audiopedia
Revision as of 15:15, 17 October 2024 by Marcelheyne (talk | contribs) (XML import)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

ప్రేమపూర్వక సంబంధం ఏర్పరచుకోవడానికి ఇరు వైపుల నుండి సమయం, శ్రద్ధ, గౌరవం మరియు నమ్మకం అవసరం. మీరు ఎదుటి వారి మీద శ్రద్ధ వహిస్తున్నారని ప్రదర్శించడానికి సెక్స్ ఒక్కటే మార్గం కాదు. సెక్స్‌లో పాల్గొన్నంత మాత్రాన మీరు ప్రేమలో పడ్డారని అర్థం కాదు.

సెక్స్ సంబంధం లేకుండానే మీరు కలసి వ్యక్తిగత సమయం గడపవచ్చు. మాట్లాడడం మరియు అనుభవాలు పంచుకోవడం ద్వారా మీరు ఒకరినొకరు గురించి మరింత ముఖ్యమైన విషయాలు నేర్చుకోవచ్చు. మీరు జీవితాన్ని ఎలా చూస్తారు, మీరు కలిసి తీసుకునే నిర్ణయాలు, మీరు ఎలాంటి భాగస్వామి మరియు తల్లిదండ్రులు కాగలరు మరియు జీవితం కోసం మీ ప్రణాళికలు గురించి మీరేం భావిస్తున్నారు లాంటి విషయాలు మాట్లాడుకోవచ్చు. ఒకరినొకరు తాకడం ద్వారా (సెక్స్ లేకుండానే) స్వయం తృప్తి పొందవచ్చు. మీరు నియంత్రణ కోల్పోవడం లేదా మీకింకా అవసరమైన పక్వత రాకుండానే సెక్స్‌లో పాల్గొనడం జరగనంత వరకు అది ప్రమాదకరం కాదు.

మీ బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడండి. అతను మీకు సరైనవాడని మీకు ఖచ్చితంగా తెలిసినప్పటికీ, సెక్స్ గురించి మీరు నిర్ణయం తీసుకోనంతవరకు, వేచి ఉండే మార్గాల గురించి అతనితో మాట్లాడండి. అతను సెక్స్ విషయంలో ఏ ఆలోచనతో ఉన్నాడో మీకు అర్థమవుతుంది మీకు పరస్పరం గౌరవం ఉంటే, మీరు కలిసి నిర్ణయం తీసుకోగలుగుతారు.

మీ స్నేహితులతో మాట్లాడండి. అదే విధమైన సంక్లిష్ట పరిస్థిని మీ సహచరుల్లో కొందరు ఎదుర్కొంటూ ఉండవచ్చు. కాబట్టి, సెక్స్ లేకుండానే మంచి సంబంధాలు కలిగి ఉండే మార్గాలు కనుగొనడంలో మీరు ఒకరికొకరు సహాయపడవచ్చు. అయితే, అప్పటికే లైంగిక సంబంధం కలిగి ఉన్న స్నేహితులు ఇచ్చే సలహా పాటించే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. సెక్స్ ద్వారా మీ స్నేహితురాలికి మంచి అనుభూతి లభిస్తుంటే, తనలాగే చేయాల్సిందిగా ఆమె మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేయవచ్చు. దీనినే 'తోటివారి ఒత్తిడి' అంటారు.

Sources
  • Audiopedia ID: tel020811