గర్భధారణ సమయంలో మరియు ప్రసవానంతరం నన్ను నేను చక్కగా సంరక్షించుకోవాల్సిన అవసరమేమిటి
From Audiopedia
ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించడం లేదనే కారణంతో, చాలామంది మహిళలు వారి గర్భధారణ సమయంలో జాగ్రత్తలు తీసుకోరు. అయితే, ఎలాంటి సమస్యలు లేనంతమాత్రాన మీరు ఆరోగ్యంగానే ఉన్నారనుకోకూడదు. అధిక రక్తపోటు లేదా శిశువు సరైన స్థానంలో లేకపోవడం లాంటి గర్భస్త మరియు జనన సమయ సమస్యలు ఉన్నప్పటికీ, ఎలాంటి సంకేతాలు కనిపించవు. గర్భంతో ఉన్నప్పుడు ఒక మహిళ క్రమం తప్పకుండా ప్రినేటల్ (ప్రసవానికి ముందు) పరీక్షలు చేయించుకోవడం వల్ల, శిక్షణ పొందిన మంత్రసాని లేదా ఆరోగ్య కార్యకర్త ఆమె శరీరాన్ని పరిశీలించి, ఆమె గర్భస్త దశ సవ్యంగానే ఉందని నిర్ధారించవచ్చు. తద్వారా, చిన్న సమస్యలు ప్రమాదకరంగా మారకుండా నిరోధించవచ్చు.