ఒకరు ఆత్మహత్యకు పాల్పడే అవకాశాన్ని సూచించే హెచ్చరిక సంకేతాలు ఏమిటి

From Audiopedia
Revision as of 15:15, 17 October 2024 by Marcelheyne (talk | contribs) (XML import)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

నిజానికి, ఆత్మహత్యకి పాల్పడే ముందు కొందరు వ్యక్తులు ఎలాంటి హెచ్చరిక సంకేతాలు ప్రదర్శించరని గమనించాలి. అయితే, ఆత్మహత్యకి పాల్పడే చాలామంది కొంతకాలం ముందు నుండి కొన్ని రకాల సంకేతాలు ప్రదర్శిస్తారు. కాబట్టి, క్రింద జాబితా చేయబడిన అనేక ఆత్మహత్య హెచ్చరిక సంకేతాలు ఏవైనా మీలో లేదా మీకు తెలిసిన ఎవరిలోనైనా కనిపిస్తే, ఆ వ్యక్తికి తక్షణ సహాయం అవసరం.

  • చాలాసార్లు నిరాశకు గురైనట్టుగా లేదా విచారంగా ఉంటారు.
  • మరణం లేదా ఆత్మహత్య గురించి మాట్లాడటం లేదా రాయడం చేస్తుంటారు.
  • కుటుంబం మరియు స్నేహితుల నుండి దూరమవుతుంటారు.
  • చాలాసార్లు నిరాశ, నిస్సహాయత, చిక్కుకుపోయినట్టు, తీవ్రమైన కోపంతో లేదా చాలా సమయాల్లో చిరాగ్గా ఉంటారు.
  • అకస్మాత్తుగా మరియు నాటకీయంగా వారి మానసిక స్థితి మారిపోతుంటుంది.
  • మాదకద్రవ్యాలు లేదా మద్యం దుర్వినియోగానికి పాల్పడుతుంటారు.
  • చాలా కార్యకలాపాల మీద ఆసక్తి ప్రదర్శించరు. గతంలో వాళ్లకి చాలా ఇష్టమైన అంశాల్లోనూ ఆసక్తి ప్రదర్శించరు.
  • నిద్ర లేదా తినే అలవాట్లలో మార్పు (నిద్రలేమి లేదా అధిక నిద్ర, ఆకలి లేకపోవడం లేదా అధికంగా తినడం).
  • పని ప్రదేశంలో లేదా పాఠశాలలో వాళ్ల ప్రవర్తన వ్యక్తీకరించలేని విధంగా చిత్రంగా ఉంటుంది.
  • తమకి ఇష్టమైన వాటిని ఇతరులకు ఇచ్చేయడం/విల్లు రాయడం చేస్తారు.

గుర్తుంచుకోండి: ఆత్మహత్య హెచ్చరిక సంకేతాలను ఎల్లప్పుడూ తీవ్రంగా పరిగణించండి. నిజానికి, వాళ్లు సహాయం కోసం ఆర్థిస్తుంటారు. కానీ, ఎవరూ వారిని పట్టించుకోరు. తనకి ఆత్మహత్య చేసుకోవాలని ఉంది అని ఎవరైనా అంటే, ఆ వ్యాఖ్యలను మీరు సీరియస్‌గా పరిగణించాలి.

Sources
  • Audiopedia ID: tel020907