నేను నా దంతాలను ఏవిధంగా రక్షించుకోవచ్చు
From Audiopedia
దంతాల విషయంలో బాగా శ్రద్ధ వహించడంచాలా ముఖ్యం ఎందుకంటే: ఆహారం నమలడానికి మరియు చక్కగా జీర్ణం చేసుకోవడానికి బలమైన, ఆరోగ్యకరమైన దంతాలు అవసరం.
దంతాలను రోజుకు రెండుసార్లు జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. తద్వారా, దంత క్షయం మరియు దంతాల నష్టానికి కారణమయ్యే సూక్ష్మక్రిములు తొలగించవచ్చు. ముందు మరియు వెనుక ఉండే అన్ని దంతాల ఉపరితలం శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత, దంతాల మధ్య మరియు చిగుళ్ల క్రింద శుభ్రం చేసుకోవాలి. మృదువైన బ్రష్, టూత్ స్టిక్‌తో లేదా గట్టిగా ఉండే వస్త్రం చుట్టుకున్న వేలితో దంతాలు శుభ్రం చేసుకోవాలి. టూత్ పేస్ట్ మంచిదే కానీ, తప్పనిసరి కాదు. ఉప్పు, బేకింగ్ సోడా లేదా సాధారణ, స్వచ్ఛమైన నీళ్లతో కూడా దంతాలు శుభ్రం చేసుకోవచ్చు.