ఆత్మహత్య ఆలోచనల సమయంలో పట్టించుకోని భావాలను ఎందుకు పరిగణించాలి

From Audiopedia
Revision as of 15:14, 17 October 2024 by Marcelheyne (talk | contribs) (XML import)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

మీ జీవితాన్ని అంతం చేయాలని మీరు ఎంచుకున్న నిర్ణయం పట్ల మీ కుటుంబం మరియు స్నేహితులు ఎలా స్పందిస్తారు? అది వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మీ పని, వ్యాపారం మరియు/లేదా ఖాతాదారుల మీద అది ఎలాంటి ప్రభావం చూపుతుంది? నా జీవితాన్ని అంతం చేసుకోవాలని నేను వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నప్పుడు వాటన్నింటి గురించి నేనెందుకు ఆలోచించాలి? లాంటి ప్రశ్నలు మీ మనస్సులో తలెత్తవచ్చు.

ఎలాంటి పొరపాటు చేయకండి. మీ ఆత్మహత్య అనేది మీ చుట్టూ ఉన్నవారిమీద వినాశకర ప్రభావం చూపుతుంది. దాని ప్రభావం వారిని జీవితాంతం వెంటాడుతుంది.

మీ ఆత్మహత్య అనేది మీరు వదిలిపెట్టిన వారికి, ముఖ్యంగా మీ కుటుంబానికి అనేక సమస్యలు కలిగిస్తుంది. వాళ్లు దుఃఖంతో, దిగ్భ్రాంతితోనే కాకుండా, జీవితాంతం అపరాధ భావనతో మరియు సిగ్గుతో చితికిపోతారు. సామాజిక కళంకంతోనే కాకుండా, మీ సమాజం నుండి బహిష్కరణను కూడా వాళ్లు ఎదుర్కోవాల్సి రావచ్చు.

ఈ సమస్యలే కాకుండా, ఆత్మహత్య చేసుకోవడం ద్వారా మీరు తప్పించుకోవాలనుకున్న సమస్యలు సైతం మీ మరణంతో పాటు మాయమైపోవు. అవన్నీ వేరొకరికి బదిలీ చేయబడుతాయి. బహుశా, మీకు ఇష్టమైన వాళ్లు లేదా మీకు సన్నిహితమైన వాళ్లు ఆ సమస్యలను మోయాల్సి ఉంటుంది.

కాబట్టి మీరు నిర్ణయం తీసుకునే ముందు వీటన్నింటి గురించి జాగ్రత్తగా ఆలోచించండి.

Sources
  • Audiopedia ID: tel020911