కుటుంబ నియంత్రణ మరియు పిల్లల మధ్య అంతరం గురించిన విభేదాలను నేనెలా పరిష్కరించగలను

From Audiopedia
Revision as of 15:14, 17 October 2024 by Marcelheyne (talk | contribs) (XML import)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

కుటుంబ నియంత్రణకు సంబంధించిన విభేదాలు పరిష్కరించడానికి, మీ భర్త లేదా భాగస్వామితో కుటుంబ నియంత్రణను ఉపయోగించడం గురించి మరియు మీరు ఉపయోగించే పద్ధతి గురించి మీరు మాట్లాడడం అవసరం. మీ సంభాషణను సులభతరం చేయడానికి క్రింది సమాచారం వారితో పంచుకోవడం మీకు సహాయపడవచ్చు:

  • 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు మహిళలు ప్రసవ సమయంలో చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే, అప్పటికింకా వారి శరీరాలు పూర్తిగా అభివృద్ధి చెంది ఉండవు మరియు వారి పిల్లలు సైతం మొదటి సంవత్సరంలోనే చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, చిన్న వయసులో పిల్లన్ని కనకపోవడమే మంచిది.
  • వయసు మీదపడిన మహిళలు సైతం పిల్లల్ని కనడంలో ఎక్కువ ప్రమాదాలు ఎదుర్కొంటారు. ప్రత్యేకించి, వారికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు లేదంటే, అప్పటికే వాళ్లకి ఎక్కువ సంఖ్యలో పిల్లలు ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి, ఆలస్యంగా పిల్లల్ని కనకపోవడమే మంచిది.
  • ఒక గర్భం తర్వాత మరో గర్భానికి ముందు మహిళ శరీరం కోలుకోవడానికి కొంత సమయం అవసరం, కాబట్టి, గర్భాల మధ్య తగినంత దూరం అనేది మహిళలకు మరియు వారి పిల్లలకు సురక్షితమైనదిగా ఉంటుంది. కాబట్టి, వెంటవెటనే పిల్లల్ని కనకపోవడమే మంచిది.
  • నలుగురి కంటే ఎక్కువ మంది పిల్లలున్న స్త్రీ తన ప్రసవ సమయంలో రక్తస్రావం మరియు ఇతర కారణాలతో మరణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఎక్కువ మంది పిల్లల్ని కనకపోవడమే మంచిది.
  • పిల్లలు తక్కువగా ఉంటే, కుటుంబం మీద ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది మరియు భర్త తన కుటుంబాన్ని బాగా చూసుకోవడానికి వీలు కల్పిస్తుంది. కాబట్టి, తక్కువ పిల్లలున్న కుటుంబంలో తమ పిల్లలకు మెరుగైన జీవన ప్రమాణాలు మరియు మెరుగైన విద్యు అందించగలరు.
  • తక్కువ మంది పిల్లలు ఉంటే, తల్లిదండ్రులు వారి సమయాన్ని వారి పిల్లల కోసం వెచ్చించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని అర్ధం.
  • కుటుంబ నియంత్రణ వల్ల ఒక జంట మరింత ఎక్కువగా ఆనందించడంలో కూడా సహాయపడుతుంది. ఎందుకంటే, అవాంఛిత గర్భాల గురించి వాళ్లు భయపడాల్సిన అవసరం ఉండదు. అయితే, అవాంఛిత గర్భం భయం లేదనే ధైర్యంతో ఇతర పురుషులతో సంబంధానికి మహిళలు సిద్ధపడుతారనేది నిజం కాదు.

కుటుంబ నియంత్రణ ప్రయోజనాలు గురించి తెలుసుకున్న తర్వాత కూడా, మీరు దానిని ఉపయోగించకూడదని మీ భర్త భావిస్తే, మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం, ఏదేమైనప్పటీ, మీరు కుటుంబ నియంత్రణ ఉపయోగిస్తారా అనే విషయం మీరే నిర్ణయించుకోవాలి. మీరు అలా చేస్తే, మీ భాగస్వామికి తెలియకుండానే ఉపయోగించగల పద్ధతిని మీరు ఎంచుకోవాల్సి రావచ్చు. మీరు ఎక్కడ నివసించినప్పటికీ, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారనే దానిమీద మీకు నియంత్రణ ఉన్నప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు.

కాబట్టి, కుటుంబ నియంత్రణ ఉపయోగించాలా, వద్దా అని నిర్ణయం తీసుకోవడమనేది ఎల్లప్పుడూ మీ ఎంపికగానే ఉండాలి.

Sources
  • Audiopedia ID: tel021012