నా మీద లైంగిక దాడి జరిగితే నేనేం చేయాలి

From Audiopedia
Revision as of 15:14, 17 October 2024 by Marcelheyne (talk | contribs) (XML import)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

ఒక మహిళ తన మీద దాడి చేసే వ్యక్తిని ప్రతిఘటించగలిగితే, ఆ వ్యక్తి వద్ద ఆయుధం ఉన్నప్పటికీ, తన మీద అత్యాచారం జరగడాన్ని ఆమె నిరోధించగలదు. ఒక మహిళ అత్యాచారానికి గురికాకుండా ఉండడం కోసం ఎంత భిన్నమైన మార్గాల్లో ప్రయత్నిస్తే, ఆమె అంతగా అత్యాచారాన్ని నిరోధించగలదు లేదంటే, అత్యాచారం తర్వాత నుండి ఆమె తక్కువ గాయాలు మరియు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఒక మహిళ మీద ఎవరైనా అత్యాచారానికి తెగించినప్పుడు ఆమె ఎలా స్పందిస్తుందో ముందుగానే చెప్పడం అసాధ్యం. కొంతమంది మహిళలకు కోపం వచ్చినప్పుడు వాళ్లకే తెలియనంత శక్తితో ఎదుటివారిని చిత్తు చేస్తారు. మరికొందరు తాము కనీసం కదలలేమని భావిస్తారు. మీకు అలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదురైతే, మీరు చేయగలిగినదంతా చేస్తారని నిర్ధారించుకోండి.

మీ మీద లైంగిక దాడి జరిగినప్పుడు మీకు సహాయపడగల కొన్ని ఐడియాలు ఇక్కడ ఉన్నాయి:

  • ఏడవకండి, వేడుకోకండి లేదా లొంగిపోకండి. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. నిజానికి, అలా చేసే మహిళలకే పోరాడే మహిళల కంటే తరచుగా ఎక్కువ గాయాలు సంభవిస్తుంటాయి.
  • అప్రమత్తంగా ఉండండి. రేపిస్టుని జాగ్రత్తగా గమనించండి. కొన్నిసార్లు అతడు మిమ్మల్ని పూర్తి స్థాయిలో గమనించకపోవచ్చు లేదా అతను నియంత్రణ కోల్పోయే సందర్భాలు ఉండవచ్చు.
  • విభిన్న విషయాలు ప్రయత్నించండి. అతన్ని తన్నండి, కేకలు వేయండి, బేరసారాలు చేయండి, మోసగించండి. మిమ్మల్ని లొంగదీయడం అంత సులభం కాదని అతను భావించేలా చేయాల్సినవన్నీ చేయండి. మీరు ఒక మనిషి అని, వస్తువు కాదని అతనికి అర్థమయ్యేలా చేసే ప్రయత్నం చేయండి.
  • రేపిస్ట్ మీకు తెలిసిన వ్యక్తి అయితే, అతని మీద మీకప్పుడు ఎలాంటి భావన కలుగుతోందో అతనికి చెప్పండి. మహిళలు అత్యాచారాన్ని అతను నమ్మే పరిస్థితి రానివ్వకండి. అతను మీకు ఎలాంటి హాని చేస్తున్నాడో అతనికి తెలియజేయండి.
  • అతను అపరిచితుడైతే, అతని రూపం గుర్తుంచుకునేందుకు ప్రయత్నించండి. అతను ఎంత సైజులో ఉన్నాడు? అతని ఒంటి మీద ఏవైనా మచ్చలు, గుర్తులు లేదా పచ్చబొట్లు ఉన్నాయా? అతను ఎలాంటి దుస్తులు ధరించాడు? లాంటి విషయాలు గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా, మీరు పోలీసులకు అతడి గురించి స్పష్టంగా చెప్పవచ్చు మరియు మీ సమాజంలోని ఇతర మహిళలను హెచ్చరించవచ్చు.
  • చాలామంది వ్యక్తులు మీ మీద అత్యాచారానికి ప్రయత్నిస్తుంటే లేదా రేపిస్ట్ చేతిలో ఆయుధం ఉంటే, అప్పటికీ మీరు ప్రతిఘటించవచ్చు కానీ, శారీరక పోరాటం మంచిది కాకపోవచ్చు.
  • మీ అత్యుత్తమ తీర్పు ఉపయోగించుకోండి. మీరు ఏమేరకు పోరాడగలరో మీకు మాత్రమే తెలుసు. కొన్ని అత్యాచార పరిస్థితుల్లో, ఉదాహరణకు, యుద్ధ సమయాల్లో, తిరిగి పోరాడాలో మీరు మాత్రమే నిర్ణయించగలరు. కొన్ని సందర్భాల్లో, ఉదాహరణకు, యుద్ధ సమయాల్లో, మీరు ప్రతిఘటిస్తే ఆ వ్యక్తి మిమ్మల్ని ప్రాణాలతో వదలకపోవచ్చు.
Sources
  • Audiopedia ID: tel020311