పురుషులు తమను హింసించినప్పటికీ మహిళలు వాళ్లతో కలసి ఉండడానికి కారణమేమిటి

From Audiopedia
Revision as of 15:14, 17 October 2024 by Marcelheyne (talk | contribs) (XML import)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

ఒక మహిళ మీద పురుషుడు హింసకు పాల్పడిన విషయం తెలిసినప్పుడు, అంత జరిగిన తర్వాత కూడా \"ఆమె ఎందుకు అతనితో కలసి ఉంటోంది? అనే ప్రశ్న మొదటగా వినిపిస్తుంటుంది. అయితే, దుర్వినియోగానికి పాల్పడే పురుషుడితో ఒక మహిళ కలిసి ఉండడానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో కొన్ని:

  • భయాలు మరియు బెదిరింపులుః

నువ్వు నన్ను వదలి వెళ్లావంటే, \"నేను నిన్ను చంపుతాను, పిల్లలను చంపుతాను, నీ తల్లిని చంపుతాను అని ఆ పురుషుడు ఆమెని బెదిరించి ఉంటాడు. తనను మరియు ఇతరులను రక్షించుకోవడానికి అతడితో కలసి ఉండడం తప్ప చేయగలిగిందేమీ లేదని ఆమె భావించి ఉండవచ్చు.

  • వెళ్లిపోవడానికి డబ్బు గానీ, వెళ్లే చోటు గానీ లేకపోవడం: డబ్బు మీద పూర్తి నియంత్రణ అతడికి ఉన్నప్పుడు, తన కుటుంబం మరియు స్నేహితుల వద్దకు వెళ్లడానికి కూడా లేకుండా ఆమెను అతను నియంత్రించగలుగుతాడు.
  • రక్షణ లేకపోవడం: హింస తర్వాత, మళ్లీ మళ్లీ ఆమె మీద హింసకి పాల్పడి, ఆమెను చంపేసే వరకు వెళ్లినా అతడిని అడ్డుకునే వాళ్లెవరూ లేకపోవడం.
  • అవమానంగా భావించడం: హింస జరగడానికి కొంతవరకు తన తప్పు కూడా ఉందని లేదంటే తనకి అలా జరగాల్సిందేనని ఆమె భావించడం.
  • మతపరమైన లేదా సాంస్కృతిక విశ్వాసాలు: ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ, వైవాహిక బంధం తెగిపోకుండా కాపాడుకోవడం తన బాధ్యతే అని ఆమె విశ్వసించడం.
  • మార్పు వస్తుందనే నమ్మకం: ఆ పురుషుడి మీద తనకు ప్రేమ ఉందని, అతనితో బంధం కావాలని ఆమె అనుకోవచ్చు. హింసను ఆపేలా అతడిలో తాను మార్పు తీసుకురాగలనని ఆమె భావించవచ్చు.
  • పిల్లలు తండ్రి లేని వారవుతారనే అపరాధభావం.

అయితే, అంత జరిగిన తర్వాత కూడా \"అతను ఎందుకు వదలి వెళ్లడు? అనే ప్రశ్న మన నుండి రావడమే కరెక్టు. \"ఆమె ఎందుకు వదలి వెళ్లదు అని మనం ప్రశ్నించామంటే, అది ఆమె వ్యక్తిగత సమస్య అని, దానిని ఆమె మాత్రమే పరిష్కరించుకోవాలని మనం భావిస్తున్నట్టు అర్థం. అయితే, హింస అనేది ఆమె సమస్య మాత్రమే అని ఆలోచించడమే తప్పు.

ఒక సమాజంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా మరియు శ్రేయస్సుతో ఉండేందుకు ఆ మొత్తం సమాజం బాధ్యత వహించాలి.

శారీరక హాని లేకుండా జీవించే ఒక స్త్రీ హక్కును ఉల్లంఘించడం లేదా ఆమెను చంపేసే నేరానికి ఒక పురుషుడు పాల్పడకుండ అతడిని అడ్డుకునే మరియు ఆపే పరిస్థితి తప్పక ఉండాలి.

Sources
  • Audiopedia ID: tel020112