రొమ్ములు పరీక్షించుకున్న సమయంలో ఏదైనా గడ్డ ఉన్నట్టు అనిపిస్తే నేనేం చేయాలి
From Audiopedia
ఆ గడ్డ మెత్తగా లేదా రబ్బరు లాగా ఉండడంతో పాటు మీరు మీ వేళ్ళతో దానిని నొక్కినప్పుడు అది చర్మం కింద కదులుతూ ఉంటే, మీరు దాని గురించి చింతించక్కర్లేదు. కానీ, అది గట్టిగా ఉండి, నిర్ధిష్ట ఆకారం లేకుండా, నొప్పి లేకుండా ఉండడమే కాకుండా, అలాంటి గడ్డ ఒక రొమ్ములో మాత్రమే ఉండి, మీరు నెట్టినా అది కదలకపోతే-దానిని గమనిస్తూ ఉండండి. మీ తదుపరి నెలసరి తర్వాత కూడా, ఆ గడ్డ అలాగే ఉంటే, ఆరోగ్య కార్యకర్తను కలవండి. అది క్యాన్సర్ సంకేతం కావచ్చు. మీకు రక్తం లేదా చీము లాంటి స్రావం కూడా ఉంటే, మీరు వైద్య సహాయం తీసుకోవాలి.