నా ప్రియమైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న తర్వాత నేను ఇతరులతో మాట్లాడాల్సిన అవసరమేమిటి

From Audiopedia
Revision as of 15:14, 17 October 2024 by Marcelheyne (talk | contribs) (XML import)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

ఇతరులతో మాట్లాడడమనేది మీకు మద్దతు అందిస్తుంది, మీకు మరింత శక్తి ఇస్తుంది మరియు మీ భావాలను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది.

సహాయం చేసే స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మీ చుట్టూ ఉండేలా చూసుకోండి మరియు వారితో మాట్లాడండి. మీరు ఒంటరి వ్యక్తి కాదని గ్రహించండి. మీకు అవసరమైనప్పుడు ఎల్లప్పుడూ సహాయం కోసం సంప్రదించండి. మీరు ప్రేమించే మరియు విశ్వసించే వ్యక్తుల నుండి మద్దతు పొందండి.

మీ ప్రాంతంలో అందుబాటులో ఉంటే, ఆత్మహత్య మద్దతు సమూహంలో చేరండి. ఆత్మహత్య కారణంగా, తమ వారిని కోల్పోయిన మరియు వారి ఆందోళనలు మరియు ఒత్తిడి గురించి మాట్లాడడం కోసం క్రమం తప్పకుండా కలిసే వ్యక్తుల స్వయం సహాయక బృందంగా అది ఉండాలి. మీరు అనుభవించే ఉద్వేగాన్ని వాళ్లు అర్థం చేసుకోగలరు. వాళ్లు దానిని స్వయంగా అనుభవించి, మీకు మద్దతు ఇస్తారు. మీ ప్రాంతంలో అలాంటి సమూహం లేకపోతే, మీరే ఒకదాన్ని ప్రారంభించడం గురించి ఆలోచించండి.

చికిత్స పొందండి (అందుబాటులో ఉంటే), లేదా మీ సమాజంలోని ఆరోగ్య కార్యకర్త లేదా మత నాయకుడితో మాట్లాడడం కూడా మీకు సహాయపడగలదు.

Sources
  • Audiopedia ID: tel020918