ప్రసవ పూర్వ తనిఖీల సమయంలో, మీ గత గర్భాలు మరియు ప్రసవాల గురించి, అధిక రక్తస్రావం లేదా శిశువులు మరణించడం లాంటి ఏవైనా సమస్యలు మీకు ఉన్నాయా అని మంత్రసాని లేదా ఆరోగ్య కార్యకర్త మిమ్మల్ని అడుగుతారు. ప్రస్తుత గర్భధారణ సమయంలో ఎలాంటి సమస్యల కసం సిద్ధంగా ఉండాలో నిర్ధారించుకోవడంలో ఈ సమాచారం సహాయపడుతుంది.
ఒక మంత్రసాని ఇలా కూడా చేయవచ్చు:
ఒక స్త్రీ తగినంతగా తింటోందని నిర్ధారించడం మరియు అవసరమైతే ఆమెకు మంచి ఆహారం తినే మార్గాలు సూచించడం.
రక్తహీనత మరియు పుట్టుకతో వచ్చే లోపాలు నివారించడానికి సహాయపడే ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వడం.
తల్లి ఆరోగ్యంగా ఉందని మరియు శిశువు బాగా పెరుగుతోందని నిర్ధారించుకోవడానికి తల్లిని పరీక్షించడం.
తల్లులు మరియు శిశువుల మరణానికి కారణమయ్యే ధనుర్వాతం నిరోధించడానికి టీకాలు వేయడం.
ఆ ప్రాంతంలో మలేరియా ఉంటే, దాన్ని నిరోధించడానికి ఔషధం ఇవ్వడం.
ఇతర సాంక్రమిక ఇన్ఫెక్షన్లతో పాటుHIV మరియు సిఫిలిస్ కోసం పరీక్షలు చేయించడం.
మహిళకు HIV ఉంటే, అది బిడ్డకు రాకుండా నిరోధించడానికి మందులు ఇవ్వడం.