మత్తుపదార్థాలు మరియు మద్యం ఉపయోగించడమనేది నా ఆరోగ్యాన్ని ఏవిధంగా శాశ్వతంగా దెబ్బతీస్తుంది

From Audiopedia
Revision as of 15:14, 17 October 2024 by Marcelheyne (talk | contribs) (XML import)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

మద్యం మరియు మాదకద్రవ్యాలు ఎక్కువగా ఉపయోగించే వ్యక్తులు ఇతరుల కంటే ఎక్కువగా మరియు తీవ్రంగా అనారోగ్యానికి గురవుతారు. వాళ్లలో ఈ పరిస్థితులు తీవ్రంగా ఉండవచ్చు:

  • పోషకాహార లేమి కారణంగా, మరింత ఎక్కువ అనారోగ్యానికి గురవుతారు.
  • క్యాన్సర్, మరియు గుండె, కాలేయం, కడుపు, చర్మం, ఊపిరితిత్తులు మరియు మూత్ర వ్యవస్థల్లో సమస్యలు, మరియు కొన్నిసార్లు శాశ్వత నష్టానికి దారితీయవచ్చు.
  • మెదడు దెబ్బతినడం లేదా మూర్ఛ (\"ఫిట్స్\").
  • HIV ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అనారోగ్యాలు త్వరగా తీవ్రమవుతాయి.
  • జ్ఞాపకశక్తి నశించడం-నిద్ర లేచినప్పుడు గతం గుర్తుండకపోవడం.
  • తీవ్రమైన నిరాశ లేదా ఆందోళన లాంటి మానసిక ఆరోగ్య సమస్యలు లేదా వింత విషయాలు చూస్తున్నట్టు లేదా వింటున్నట్టు (భ్రాంతులు) ఉండడం, ఇతరుల పట్ల అనుమానంతో వ్యవహరించడం లేదా గతస్మృతులు కలిగి ఉండడం.
  • ఏకకాలంలో మాదకద్రవ్యాల అతి వినియోగం (అధిక మోతాదు) కారణంగా మరణం.

వీటితోపాటు, వీళ్లు (వీళ్ల కుటుంబాలు కూడా) తరచుగా ప్రమాదాలకు గురికావడం వల్ల గాయాలు లేదా మరణం సంభవించవచ్చు. ఎందుకంటే, వీళ్లు మద్యం లేదా మాదకద్రవ్యాలు తీసుకున్న సమయంలో వారి శరీరం మీద నియంత్రణ కోల్పోవడం వల్ల చెడు నిర్ణయాలు తీసుకోవడం లేదా అనవసర ప్రమాదాలకు ఎదురెళ్లడం చేస్తుంటారు. వీళ్లు అసురక్షిత లైంగిక సంబంధాలు కలిగి ఉంటే, మాదకద్రవ్యాలు ఇంజెక్ట్ చేయడానికి ఉపయోగించే సూదులు పంచుకోవడం లేదా మత్తుమందుల కోసం లైంగిక చర్యకు సిద్ధమైతే, వీళ్లకి హెపటైటిస్, HIV మరియు లైంగికంగా సంక్రమించే ఇతర ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది.

పొగాకు నమలి వ్యక్తులు కూడా పొగాకు ధూమపానం చేసే వాళ్లతో సమానంగా ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది.

పొగాకు మరియు వక్క నమలడం వల్ల ఒక వ్యక్తిలో తరచుగా దంతాలు మరియు చిగుళ్లు నాశనమవుతాయి మరియు నోటిలో పుళ్ళు, నోటి మరియు గొంతు క్యాన్సర్ రావడం వల్ల శరీరం మొత్తం హాని కలిగిస్తుంది. వక్క నమలడం వల్ల కడుపు సమస్యలు మరియు మలబద్ధకం వస్తాయి.

చాలామంది పేద ప్రజలు, ప్రత్యేకించి వీధుల్లో నివసించే వాళ్ల పిల్లలు వాళ్ల ఆకలి మరచిపోవడానికి తరచుగా జిగురు మరియు ద్రావకాలు వాసన చూస్తుంటారు. ఇది అత్యంత వ్యసనంగా మారుతుంది. దీనివల్ల వారిలో చూపు సమస్యలు, ఆలోచించడం మరియు జ్ఞాపకశక్తిలో ఇబ్బంది, హింసాత్మక ప్రవర్తన, తీర్పు మరియు శరీర నియంత్రణ కోల్పోవడం, తీవ్రంగా బరువు తగ్గడం, గుండె వైఫల్యం మరియు ఆకస్మిక మరణం లాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు.

ఒక వ్యక్తి క్రింది పనులు చేసే సమయంలో మాదకద్రవ్యాలు లేదా మద్యం సేవిస్తే, అది ప్రమాదకరం:

  • డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, యంత్రం లేదా ప్రమాదకర పనిముట్టు ఉపయోగిస్తున్నప్పుడు.
  • గర్భవతిగా ఉన్నప్పుడు లేదా తల్లిపాలు ఇస్తున్నప్పుడు.
  • చిన్న పిల్లల సంరక్షణ చూస్తున్న సమయంలో.
  • ఔషధాలు తీసుకుంటున్నప్పుడు, ప్రత్యేకించి నొప్పి, నిద్ర, ఫిట్స్ (మూర్ఛలు) లేదా మానసిక ఆరోగ్య సమస్యల కోసం ఔషధాలు తీసుకుంటున్నప్పుడు.
  • కాలేయం లేదా మూత్రపిండాల వ్యాధి ఉన్నప్పుడు.
Sources
  • Audiopedia ID: tel010305