ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన నాకు వచ్చినప్పుడు నేనేం చేయాలి

From Audiopedia
Revision as of 15:13, 17 October 2024 by Marcelheyne (talk | contribs) (XML import)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

మీరు చాలాకాలంగా అత్యంత నిరాశకు గురైతే, ఇక మిగిలిందేమీ లేదని, ప్రతిరోజూ మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఎదుర్కోవటానికి ఏ మార్గమూ లేదని, జీవించడానికి ఏమీ మిగల్లేదని మీకు అనిపిస్తే, అలాంటి పరిస్థితిలో ఆత్మహత్య ఒక్కటే ఏకైక పరిష్కారం అని మీకు అనిపించవచ్చు. అయితే, నిజానికి ఆత్మహత్య అనేది ఒక సమస్యే తప్ప, పరిష్కారం కాదు. ప్రస్తుతం మీ సమస్యలకు పరిష్కారం లేదని మీకు అనిపించినప్పటికీ, మరే ఇతర పరిష్కారం లేదని మరియు సమీప భవిష్యత్తులో కూడా ఉండదని దాని అర్థం కాదు. ప్రస్తుతానికి మీకు ఆ పరిష్కారం కనిపించలేదని మరియు అప్పటివరకు మీరు మీ జీవితపు పగ్గాలు గట్టిగా పట్టుకోవాలని దాని అర్థం.

ఒక్క నిమిషం ఆలోచించండి: మీ పరిస్థతి ఇప్పుడు ఉన్నట్టుగానే ఎప్పుడూ ఉంటోందని అనిపిస్తోందా? నిజానికి, మీ జీవితంలోనూ అవకాశాలు ఉన్నాయి. మీరు మీ జీవితంలో పెద్దగా పట్టించుకోని సందర్భాలు ఉన్నాయి. మీకు ఎదురైన పరిస్థితులు మరీ అంత చెడ్డవి కానప్పుడు, అవి మంచివి కూడా కావచ్చు. కాబట్టి, మీ జీవితంలో వచ్చిన ఏదో మార్పు మిమ్మల్ని ఈ నిరాశకు గురిచేసిందని మీకు అర్థమైందా? కాబట్టి, ఓపిక పట్టండి. జీవితంలో మార్పు తప్పక వస్తుంది. అప్పుడు పరిస్థితులు మెరుగుపడుతాయి. జీవితమంటేనే, సుఖదుఃఖాల చక్రం కదా.

మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు:

  • ఆత్మహత్య భావన కలిగినందుకు మిమ్మల్ని మీరు నిందించుకోకండి. జీవితంలో భారమైన క్షణాలు కూడా జీవితంలో ఒక భాగమే. అదేమీ మీ తప్పు కాదు.
  • ఆత్మహత్య ఆలోచన మిమ్మల్ని చెడ్డ వ్యక్తిగా, లేదా వెర్రిగా, లేదా బలహీనంగా లేదా లోపభూయిష్టంగా మార్చేయదు.
  • ఆత్మహత్య గురించి ఆలోచించినంత మాత్రాన మీరు నిజంగా అలా చేస్తారని అర్థం కాదు. మీరు ప్రస్తుతం మీ సామర్థ్యానికి మించిన బాధను అనుభవిస్తున్నారని మాత్రమే దాని అర్థం. ఎవరైనా మీ భుజాల మీద బరువులు వేస్తూనే ఉంటే, మీరు ఎంత సమర్థులైనా ఒక నిర్థిష్ట దశ తర్వాత మీరు కుప్పకూలిపోతారు. అది సాధారణ విషయమే.

మీ ఆత్మహత్య ఆలోచనలను అధిగమించడంలో క్రింది ఆలోచనలు మీకు సహాయపడగలవు:

  • మీకు మద్దతుగా నిలిచే వారితో మాట్లాడండి (స్నేహితుడు, ప్రేమికుడు, బంధువు, తెలిసిన వ్యక్తి లేదా మద్దతు ఇచ్చే అపరిచితుడైనా సరే)
  • వైద్యుడిని, థెరపిస్ట్‌ని లేదా ఆరోగ్య కార్యకర్తను కలవండి
  • మీలాంటి పరిస్థితిలో ఉన్న ఇతరుల ప్రతిస్పందనలు మరియు బాధను పరిగణనలోకి తీసుకోండి
  • ఆత్మహత్య ప్రయత్నాలను ప్రతీకార సాధనంగా లేదంటే బెదిరింపు సందేశంగా ఉపయోగించకండి
  • మీలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇతరుల మద్దతు కోసం వెతకండి. మద్దతు సమూహం లేదా అలాంటి ఏదైనా సమూహంలో చేరండి.
  • అతి స్పందనతో వ్యవహరించకండి.
Sources
  • Audiopedia ID: tel020908