భారీ బరువులు ఎత్తడం మరియు మోయడం వల్ల నా ఆరోగ్యం ఎలా దెబ్బతింటుంది
From Audiopedia
సాధారణంగా, రోజువారీ పనిలో భారీగా బరువు ఎత్తడం వల్ల ప్రతిచోటా మహిళలు వెన్నునొప్పి మరియు మెడ సమస్యలతో బాధపడుతుంటారు. నీరు, వంటచెరకు మరియు పెద్ద పిల్లలను ఎక్కువ దూరం మోసుకు వెళ్లడం లాంటివి మహిళల మీద తీవ్రమైన ఒత్తిడి కలిగిస్తుంది.
నీళ్లు లాంటి భారీ బరువులు మోసుకెళ్లే యువతులు వీపు మరియు వెన్నెముక సమస్యలతో బాధపడుతుంటారు. వారి కటి ఎముకలు కూడా పెలుసుగా మారుతుంది. ఆ తర్వాతి కాలంలో, అది ప్రమాదకర గర్భాలకు దారితీస్తుంది.
భారీ బరువులు మోయడం వల్ల యువతులు ఎక్కువగా గర్భస్రావాలకు గురికావచ్చు మరియు వృద్ధ మహిళలు మరియు ఇటీవల జన్మనిచ్చిన వారిలో ట్యూబుల్లో గర్భం దాల్చే (ప్రోలాప్స్) అవకాశం ఎక్కువగా ఉంటుంది .