ఏ రకమైన అత్యాచారం మరియు లైంగిక దాడి ఉనికిలో ఉన్నాయి

From Audiopedia
Revision as of 15:13, 17 October 2024 by Marcelheyne (talk | contribs) (XML import)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

విభిన్న రకాల లైంగిక దాడులు ఉనికిలో ఉన్నాయి. అయితే, వాటిలో కొన్నింటిని మాత్రమే చాలామంది అత్యాచారంగా పరిగణిస్తుంటారు. ఉదాహరణకు, కొన్నిసార్లు జీవితంలో పరిస్థితుల కారణంగా, ఒక మహిళ తనకు ఇష్టం లేనప్పటికీ, సెక్స్‌కి సిద్ధమయ్యేలా ప్రేరేపించబడుతుంది. వివాహం విషయంలో ఇలా జరగవచ్చు. కొంతమంది వివాహిత మహిళలు తమకు ఇష్టం ఉన్నా, లేకపోయినా సెక్స్‌లో పాల్గొనడం తమ కర్తవ్యంగా భావిస్తారు. ఇలాంటి బలవంతపు లైంగిక బంధానికి సమాజం శిక్షించనప్పటికీ, అది తప్పే.

కొందరు మహిళలకు సెక్స్ అనేది బ్రతకడానికి ఒక దారి లాంటిది. పిల్లలను రక్షించుకోవడానికి, ఆశ్రయం కోసం లేదా కొంత డబ్బు కోసం లేదా ఉపాధి కోసం వాళ్లు ఆ మార్గం ఎంచుకుంటారు. కారణం ఏదైనప్పటికీ, ఒక మహిళకు ఇష్టం లేకపోతే, ఆమెను సెక్స్ కోసం బలవంతం చేయకూడదు.


ఏ బంధంలోనైనా సరే, పురుషుడి సెక్స్ కోరికను మహిళ అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఆమె నిరాకరించినప్పుడు, ఆమెను గౌరవించి, ఆమె నిర్ణయాన్ని అంగీకరించడం, ఆమె మనసు మార్చే ప్రయత్నం చేయడం లేదా ఆమెను బలవంతం చేయడం అనే ఎంపికలు పురుషుడికి ఉంటాయి. స్త్రీకి ఆ పురుషుడు తెలిసినప్పటికీ, \"వద్దు\" అని చెప్పలేని పరిస్థితిలో ఆమె \"సరే\" అని ఉంటే కూడా అది అత్యాచారమే అవుతుంది.

ఒక పురుషుడు పరిచితమైన వ్యక్తి అయినప్పటికీ, అతడిని సహాయం కోరడమనేది స్త్రీకి తరచుగా కష్టంగానే ఉంటుంది. మరోసారి అతని సమక్షంలో ఉన్నప్పుడు కూడా సురక్షితంగా భావించడం ఆమెకి కష్టంగానే ఉంటుంది. ఏ సమయంలోనైనా సరే, హింసతో కూడిన లేదా హింస లేకుండా కూడా, ఒక మహిళకు ఇష్టం లేకుండా జరిగే సెక్స్ అనేది ఆమె ఆరోగ్యం మీద మరియు భావోద్వేగాల మీద అనేక సమస్యలు కలిగిస్తుంది.

Sources
  • Audiopedia ID: tel020303