నేను నా పోషకాహారాన్ని ఎలా మెరుగుపరుచుకోగలను

From Audiopedia
Revision as of 15:13, 17 October 2024 by Marcelheyne (talk | contribs) (XML import)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

పోషకాహారం మెరుగుపరచడానికి కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి. ఎక్కువ ఆహారం లేదా వివిధ రకాల ఆహారం పెంచడానికి లేదా ఆ ఆహారం చెడిపోకుండా ఉండడం కోసం దానిని సరైన పద్ధతిలో నిల్వ చేయడానికి ఈ సూచనలు మీకు సహాయపడతాయి. ఈ ఉదాహరణల్లో కొన్ని శీఘ్ర ఫలితాలు ఇస్తాయి. మిగిలినవి దీర్ఘ కాలం పనిచేస్తారు.

ఒక చిన్న భూమిలో ఉత్పత్తి అయ్యే ఆహార పరిమాణాన్ని పెంచడానికి, వివిధ రకాల పంటలను కలిసి నాటడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు, నేల మీద పాకుతున్నట్టుగా పెరిగే మొక్కలను పొడవైన మొక్కలతో కలపవచ్చు. రెండింటి పైన పండ్ల చెట్లు నాటవచ్చు లేదా పెరగడానికి తక్కువ సమయం పట్టే మొక్కలను ఎక్కువ సమయం పట్టే మొక్కలతో కలపవచ్చు. అప్పుడు రెండవ పంట బాగా పెరగడానికి ముందే మొదటి పంట కోతకు వస్తుంది.

మీరు వాణిజ్య పంటలు (మీరు విక్రయించే ఆహారేతర పంటలు) నాటవలసి వస్తే, వాణిజ్య పంటలతో పాటు ఆహార పంటలు నాటడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు, కాఫీ పంటకి నీడ కోసం కాయలు లేదా పండ్ల చెట్లు నాటండి లేదా పత్తితో కలిపి కసావా నాటండి.

స్థానిక పరిస్థితుల్లో బాగా పెరిగే పోషకాహార మొక్కలు కనుగొనడానికి ప్రయత్నించండి. తద్వారా మంచి ఫలితాల కోసం మీకు తక్కువ నీరు మరియు ఎరువులు సరిపోతాయి.

పంటల మార్పిడి: ప్రతి కొత్త పంట సీజన్‌కు ముందు బీన్స్, బఠానీ, కాయధాన్యాలు, ఆల్ఫాఆల్ఫా, వేరుశెనగ లేదా కాయలు కాసే ఇతర పంటలు (చిక్కుళ్ళు లేదా పప్పుధాన్యాలు) వేయడం ద్వారా, పొలంలోని మట్టికి శక్తి అందించండి. ఉదాహరణకు, ఈ సంవత్సరం మొక్కజొన్న వేయండి. వచ్చే సంవత్సరం బీన్స్ వేయండి.

వివిధ రకాల ఆహార పంటలు పండించడానికి ప్రయత్నించండి. ఆ విధంగా, ఒక పంట విఫలమైనప్పటికీ, మీరు తినడానికి ఇంకా ఏదో ఉంటుంది.

కాంటూర్ గుంతలనేవి మట్టి కొట్టుకుపోకుండా నిరోధిస్తాయి.

సహజ ఎరువులు ఉపయోగించండి. కంపోస్ట్ దిబ్బ ఏర్పాటు చేయండి. తద్వారా, అవి మీకు ఉచితంగా అందుబాటులో ఉంటాయి.

వీలైతే, ఇతరులతో కలిసి ఆహార సహకారం సంఘం ఏర్పాటు చేయండి. ఆ సంఘం ద్వారా, మీ సమాజం కోసం తక్కువ ధరలో పెద్ద మొత్తంలో ఆహారం కొనుగోలు చేయవచ్చు.

Sources
  • Audiopedia ID: tel010422