నన్ను నేను ఎలా రక్షించుకోగలను

From Audiopedia
Revision as of 15:12, 17 October 2024 by Marcelheyne (talk | contribs) (XML import)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

ఈ ఆత్మరక్షణ విన్యాసాలను ఒక స్నేహితుడితో కలిసి సాధన చేయండి. తద్వారా, దాడి చేసే వ్యక్తితో పోరాడేందుకు మీరు సిద్ధంగా ఉంటారు. వీలైనంత గట్టిగా అతన్ని కొట్టండి. అతన్ని బాధపెట్టడానికి బయపడకండి. ఎందుకంటే, మిమ్మల్ని బాధపెట్టడానికి అతనేమీ భయపడడం లేదు.

వెనుక నుండి మీ మీద దాడి చేస్తే

  • మీ మోచేత్తో అతని కడుపులో గట్టిగా కొట్టండి.
  • మీ మడమతో అతని పాదంపై గట్టిగా తొక్కండి.
  • మీ చేతిని వెనక్కు పంపి, అతని వృషణాలు పట్టుకోండి మరియు వాటిని గట్టిగా నొక్కండి.
  • మీ మడమతో, అతని కాలు క్రింది భాగంలో లేదా మోకాలి భాగంలో గట్టిగా తన్నండి.

ముందు నుండి మీ మీద దాడి చేస్తే

  • మీ వేళ్లతో అతని కళ్ళలోకి గట్టిగా పొడవండి.
  • 2 పిడికిళ్లతో అతని తలకు ఇరువైపులా లేదా అతని చెవుల మీద కొట్టండి.
  • మీ పిడికిళ్లు బలంగా చేసుకుని మీకు వీలైనంత బలంగా అతడి ముక్కు మీద గుద్దండి.
  • మీ మోకాలు మడచి, మీకు వీలైనంత వేగంగా, వీలైనంత బలంగా అతడి వృషణాల మీద తన్నండి.

మరిన్ని స్వీయ రక్షణ ఐడియాలు:

మీరు బహిరంగ ప్రదేశంలో ఉంటే, ఎవరైనా మిమ్మల్ని హింసించడానికి లేదా దుర్వినియోగపరచడానికి సిద్ధమైతే, మీకు వీలైనంత గట్టిగా అరవండి.

  • అతను ఇబ్బంది పడే విధంగా ఏదైనా చేయండి. అంటే, అతని ముఖం మీద ఉమ్మేయడం లేదా అతని మీద వాంతి చేయడం లేదా మీకు పిచ్చెక్కినట్టుగా ప్రవర్తించండి.
  • మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తి మీ ఇంట్లో సభ్యుడైతే, మీ ఇంట్లో మీరు విశ్వసించే వేరొక వ్యక్తితో ఆ విషయం చెప్పండి.
Sources
  • Audiopedia ID: tel020310