ఆత్మహత్య భావన వచ్చినప్పుడు డాక్టర్ లేదా థెరపిస్ట్ ను ఎందుకు కలవాలి

From Audiopedia
Revision as of 15:10, 17 October 2024 by Marcelheyne (talk | contribs) (XML import)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

చికిత్స చేయని డిప్రెషన్ అనేది ఆత్మహత్యకు ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉంటోంది. తొలి సందర్భంలో ఆనందం మాత్రమే అందించే - కొత్తగా బిడ్డ పుట్టడం లేదా ఉద్యోగం రావడం లాంటి సంఘటనలు సైతం నిరాశకు కారణం కాగల స్థాయిలో ఒత్తిడిగా మారవచ్చు. ఉదాహరణకు, ప్రసవానంతర కుంగుబాటు (లేదా కాన్పు తర్వాత కుంగుబాటు) చాలా సాధారణం. ప్రతి 5 మంది మహిళల్లో ఒకరు ఈ ప్రసవానంతర కుంగుబాటుతో బాధపడుతారు. కొందరికైతే, తాము అలాంటి సమస్యలో ఉన్నట్టు కూడా తెలియదు.

మెదడులోని రసాయనాల అసమతుల్యత కారణంగా డిప్రెషన్ సంభవిస్తుంది. ఇది ఒక వ్యాధి. కాబట్టి, నిరాశకు గురైనప్పుడు మీరు ఏమాత్రమూ అపరాధ భావనకు గురికాకూడదు.

ప్రాథమికంగా, మీలో ఆత్మహత్య ఆలోచనలు రెండు వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా కొనసాగుతుంటే, మీకు బహుశా నిరాశలో ఉన్నారని అర్థం. మీరు దానికోసం చికిత్స తీసుకోవాలి. మిమ్మల్ని సరిగ్గా అంచనా వేయడం కోసం దయచేసి ఒక సైకియాట్రిస్ట్ లేదా ఫిజీషియన్ మరియు థెరపిస్ట్‌తో అపాయింట్మెంట్ తీసుకోండి. మానసిక స్థితిని స్థిరీకరించే ఔషధాలు మరియు మానసిక చికిత్సల కలయికతో డిప్రెషన్‌ను నయం చేయవచ్చు.

Sources
  • Audiopedia ID: tel020910