పరిశుభ్రత అనేది వ్యాధులను ఎలా నిరోధించగలదు
From Audiopedia
వివిధ ఆరోగ్య సమస్యలు వివిధ మార్గాల్లో వ్యాప్తి చెందుతాయి. ఉదాహరణకు, క్షయవ్యాధి (TB) సూక్ష్మక్రిములు గాలి ద్వారా వ్యాపిస్తాయి. పేలు మరియు గజ్జి లాంటివి దుస్తులు మరియు బెడ్ కవర్ల ద్వారా వ్యాపిస్తాయి. ఇలాంటి సూక్ష్మక్రిముల వ్యాప్తిని అడ్డుకోవడం ద్వారా వ్యాధులను నిరోధించడంలో సమాజంలోని పరిశుభ్రత (పారిశుద్ధ్యం), ఇంట్లో పరిశుభ్రత మరియు వ్యక్తిగత పరిశుభ్రత అన్నీ కీలకమైనవి.