ఇతర మహిళలతో కలిసి వ్యవహరించడమనేది నాకు ఏవిధంగా సహయపడగలదు

From Audiopedia
Revision as of 17:27, 17 October 2024 by Marcelheyne (talk | contribs) (XML import)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

ఇతర మహిళలతో కలిసి వ్యవహరించడమనేది మీకు ఈ విధంగా సహాయపడగలదు:

  • మద్దతు పొందండి:

మానసిక ఆరోగ్య సమస్యలు తరచుగా స్త్రీ శక్తిని హరించడంతో పాటు ఆమెను నిరుత్సాహపరుస్తాయి. స్త్రీలు కలిసి వ్యవహరించడమనేది స్త్రీకి మరింత శక్తిని ఇస్తుంది. ఆమె రోజువారీ సమస్యలను ఎదుర్కోవటానికి ఇది సహాయపడుతుంది.

  • భావాలు గుర్తించండి:

కొన్నిసార్లు మహిళలు తమ భావాలు దాచిపెడుంతుంటారు (లేదా తమలో అలాంటివి ఉన్నాయని కూడా గ్రహించరు). ఎందుకంటే, తమ భావాలు చెడ్డవి, ప్రమాదకరమైనవి లేదా సిగ్గుపడాల్సినవి అని వాళ్లు భావిస్తుంటారు. ఇతరులు వారి భావాల గురించి మాట్లాడినప్పుడు వినడమనేది ఒక మహిళ తన భావాలను గుర్తించడంలో సహాయపడుతుంది.

  • హఠాత్తుగా వచ్చే ప్రతిచర్యలను నియంత్రించండి:

ఒక మహిళ తన సమస్య గురించి ఆలోచించడంలో సమూహ సభ్యులు సహాయపడగలరు. తద్వారా, ఆమె తన మొదటి ప్రేరణ మీద ఆలోచనారహితంగా వ్యవహరించదు.

  • అంతర్లీన కారణాలు అర్థం చేసుకోండి:

కలిసి మాట్లాడటం ద్వారా, తమలో చాలా మంది ఒకే రకమైన సమస్యలతో బాధపడుతున్నారని మహిళలు గ్రహించడం ప్రారంభిస్తారు. సమస్యకు మూల కారణాలు గుర్తించడంలో ఇది వారికి సహాయపడుతుంది.

  • పరిష్కారాలు రూపొందించండి:

ఒక సమూహంలో చర్చించబడే పరిష్కారాలనేవి తరచుగా ఒక మహిళ స్వయంగా ఆలోచించే వాటి కంటే సులభంగా ఆమోదించబడతాయి మరియు ఉపయోగించబడతాయి.

  • సామూహిక శక్తిని పెంపొందించుకోండి:

ఒంటరిగా వ్యవహరించే మహిళ కంటే కలిసి వ్యవహరించే మహిళలు మరింత శక్తివంతులుగా ఉంటారు.

Sources
  • Audiopedia ID: tel011514