సిరల్లో వాపు వెరికోస్ సిరలును నేనెలా నిరోధించగలను: Difference between revisions

From Audiopedia
Jump to: navigation, search
(XML import)
 
(XML import)
 
Line 11: Line 11:
* ''Audiopedia ID: tel010709''
* ''Audiopedia ID: tel010709''


  [[Category:తెలుగు]] [[Category:స్తన్యపానం]]
  [[Category:తెలుగు]] [[Category:గర్భం మరియు ప్రసవం]]

Latest revision as of 17:28, 17 October 2024

కాళ్లలో మరియు కాళ్ల చుట్టూ సిరలు వాపుతో, నీలం రంగులో కనిపిస్తుంటే, వాటినే వెరికోస్ సిరలు అంటారు. కడుపులో బిడ్డ పెరుగుతున్న కారణంగా ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఇవి చాలా పెద్దవిగా మరియు బాధాకరంగా మారవచ్చు.

దీనిని నివారించడానికి ఏమి చేయాలి:

  • ఎక్కువసేపు నిలబడకుండా ఉండటానికి ప్రయత్నించండి. మీరు నిలబడాల్సి వస్తే, అదే స్థానంలో అటూఇటూ నడవండి లేదా మీ పాదాలు మరియు కాళ్లు కదిలిస్తూ ఉండండి. మీరు కూర్చున్నప్పుడు, వీలైనంత తరచుగా మీ పాదాలు పైకి లేపుతూ ఉండండి.
  • ప్రతిరోజూ నడుస్తున్నారని నిర్ధారించుకోండి. మీకు అంగవైకల్యం ఉండి, నడవలేని పరిస్థితి ఉంటే, మీ కాళ్లు కదిలించడానికి మరియు మీరు వ్యాయామం చేయడానికి సహాయం చేయాల్సిందిగా మీ కుటుంబంలోని ఎవరినైనా అడగండి.
  • సమస్య తీవ్రంగా ఉంటే, మీ కాళ్లకు బిగుతుగా వస్త్రం చుట్టండి. చీలమండ నుండి ప్రారంభించి పైకి చుట్టండి మరియు మోకాలి క్రింద వరకు మాత్రమే చుట్టండి. చీలమండ వద్ద ఈ కట్టు గట్టిగా ఉండి, పైకి వెళ్లే కొద్దిగా వదులుగా ఉండాలి. రాత్రిపూట ఈ పట్టీలు తీసివేయండి.
Sources
  • Audiopedia ID: tel010709