భరింపు నైపుణ్యాలు బలోపేతం చేసి మానసిక సమస్యలను ఎలా నిరోధించాలి: Difference between revisions

From Audiopedia
Jump to: navigation, search
(XML import)
 
(XML import)
 
Line 13: Line 13:
* ''Audiopedia ID: tel011511''
* ''Audiopedia ID: tel011511''


  [[Category:తెలుగు]] [[Category:న్యుమోనియా మరియు క్షయ వ్యాధి]]
  [[Category:తెలుగు]] [[Category:మానసిక ఆరోగ్యం]]

Latest revision as of 17:26, 17 October 2024

మహిళలు తమ తీరిక లేని పనుల మధ్య తమ కోసం ఏదైనా చేయడానికి తరచుగా సమయం కేటాయించరు. కానీ, ప్రతి స్త్రీ కొన్నిసార్లు తన సమస్యలను పక్కన పెట్టి, తనకు నచ్చినది ఏదైనా చేయాలి. మీరు చాలా తరచుగా చేయని సాధారణ పనులు-ఒంటరిగా సమయం గడపడం లేదా షాపింగ్‌కి వెళ్లడం, తోటపని లేదా స్నేహితుడితో వంట చేయడం లాంటివి-ఇందుకు సహాయపడతాయి.

మీ భావాలను బయటపెట్టడానికి కార్యకలాపాలు: మీరు కోపంగా ఉంటే, కొంత శారీరక శ్రమ చేయండి. ఇతరులకు విషయాలు చెప్పడంలో మీకు ఇబ్బంది ఉన్నప్పుడు కవితలు, పాటలు మరియు కథలు రాయడం సహాయపడుతుంది లేదా మీరు మాటలు ఉపయోగించకుండా మీ భావాలకు రూపం ఇవ్వొచ్చు-ఇందుకోసం మీరు కళాకారులుగా ఉండవలసిన అవసరం లేదు.

ఆహ్లాదకర పరిసరాలు సృష్టించడం: మీ నివాస స్థలం సరిచేయడానికి ప్రయత్నించండి, తద్వారా అది మీకు సరైన అనుభూతిని కలిగిస్తుంది. అది ఎంత చిన్నదైనా, మీకు నచ్చిన విధంగా అమర్చినప్పుడు మీరు మరింత క్రమతను మరియు నియంత్రణను అనుభవిస్తారు. వీలైనంత ఎక్కువ కాంతి మరియు స్వచ్ఛమైన గాలి వచ్చే పరిస్థితులు కలిగి ఉండటానికి ప్రయత్నించండి.

మీ చుట్టూ కొంచెం అందంగా ఉండే లాంటి పరిస్థితుల కోసం ప్రయత్నించండి. అంటే, గదిలో కొన్ని పువ్వులు పెట్టడం, సంగీతం వాయించడం లేదా మంచి దృశ్యం ఉన్న చోటికి వెళ్లడం లాంటివి చేయండి.

అంతర్గత బలం పెంపొందించే అభ్యాస సంప్రదాయాలు: అనేక సమాజాల్లో శరీరం మరియు మనస్సును శాంతపరచడానికి, అలాగే అంతర్గత బలం పెంపొందించడానికి సహాయపడే పద్ధతులు ఉంటాయి. ఉదాహరణకు: యోగా, ప్రార్థన, ధ్యానం లేదా తాయ్ చి. లాంటి సంప్రదాయాలను క్రమం తప్పకుండా ఆచరించడం ద్వారా, ఒక వ్యక్తి తన జీవితంలో ఒత్తిడి మరియు ఇతర ఇబ్బందులను సమర్థంగా ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.

Sources
  • Audiopedia ID: tel011511