సెక్స్ గురించి నేను ఏమి తెలుసుకోవాలి

From Audiopedia
Jump to: navigation, search

  • మీరు సెక్స్‌లో పాల్గొనడం అదే మొదటిసారి అయినప్పటికీ, మీరు గర్భవతి కావచ్చు.
  • కుటుంబ నియంత్రణ పద్ధతి ఏదీ పాటించకపోతే (ఒక్కసారి అయినా సరే), మీరు గర్భవతి కావచ్చు.
  • పురుషుడు తన విత్తనం (వీర్యం) బయటకు రానివ్వకుండా ఆపేశానని భావించినప్పటికీ, మీరు గర్భవతి కావచ్చు.
  • వ్యాధి సోకిన వ్యక్తితో సెక్స్‌లో పాల్గొన్నప్పుడు మీరు కండోమ్ ఉపయోగించకపోతే, మీకు STI లేదా HIV సోకవచ్చు. ఒక వ్యక్తిని చూడడం ద్వారా వారికి వ్యాధి సోకిందో, లేదో మీరు చెప్పలేరు.
  • ఒక అబ్బాయి లేదా పురుషుడికి ఒక అమ్మాయి కారణంగా సాంక్రమిక ఇన్ఫెక్షన్ (STI) లేదా HIV రావడం కంటే, అతని వల్ల అలాంటి వ్యాధులు ఆమెకి సులభంగా సోకుతాయి. సెక్స్‌లో ఆమె స్వీకర్తగా ఉండడమే అందుకు కారణం. ఒక అమ్మాయికి ఇన్ఫెక్షన్ ఉంటే అది ఆమె శరీరం లోపల ఉంటుంది కాబట్టి, ఆమెకి ఇన్ఫెక్షన్ ఉందో, లేదో తెలుసుకోవడం కూడా కష్టమే.

STIలు మరియు HIV నుండి రక్షణ కోసం ఎల్లప్పుడూ కండోమ్ ఉపయోగించండి. అయితే, సెక్స్ చేయకుండా ఉండడం ఒక్కటే గర్భం, STIలు మరియు HIV రాకుండా నిరోధించడానికి అత్యంత ఖచ్చితమైన మార్గం కాగలదు.

Sources
  • Audiopedia ID: tel020810