వ్యక్తిగత పరిశుభ్రత అనేది ఏవిధంగా వ్యాధులను నిరోధించగలదు

From Audiopedia
Jump to: navigation, search

వీలైతే ప్రతిరోజూ సబ్బు మరియు శుభ్రమైన నీటితో శరీరం శుభ్రం చేసుకోవడం ఉత్తమం. వీలైతే, ఇవి కూడా చేయండి: ఆహారం తినే ముందు లేదా తయారుచేసే ముందు, మూత్ర లేదా మల విసర్జన తర్వాత మరియు శిశువు లేదా అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి సపర్యలు చేయడానికి ముందు మరియు తర్వాత మీ చేతులు కడుక్కోండి. తేలికపాటి సోపు మరియు నీటితో ప్రతిరోజూ జననేంద్రియాలు శుభ్రం చేసుకోండి. పిచికారీలతో సరిపెట్టకండి. కొద్ది మొత్తంలో తడి లేదా స్రావం విడుదల చేయడం ద్వారా యోని స్వయంగా శుభ్రం చేసుకుంటుంది. తనను తాను రక్షించుకుంటుంది. పిచికారీలు ఈ రక్షణను నాశనం చేస్తాయి మరియు ఆ మహిళకు యోని ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెంచుతాయి.

  • లైంగిక ప్రక్రియ తర్వాత మూత్ర విసర్జన చేయండి. మూత్ర వ్యవస్థలో ఇన్ఫెక్షన్లు నివారించడంలో ఇది సహాయపడుతుంది (కానీ, ఇది గర్భధారణను నిరోధించదు).
  • మల విసర్జన తర్వాత జాగ్రత్తగా తుడుచుకోండి. ఎల్లప్పుడూ ముందు నుండి వెనుకకు తుడుచుకోండి. వెనుక నుండి ముందుకు తుడవడం వల్ల మూత్ర ద్వారం మరియు యోనిలోకి సూక్ష్మక్రిములు మరియు పురుగులు వ్యాప్తిస్తాయి.
Sources
  • Audiopedia ID: tel010111