మరుగుదొడ్డిని నేనెలా నిర్మించగలను

From Audiopedia
Jump to: navigation, search

1⁄2 మీటరు వెడల్పు, 1⁄2 మీటరు పొడవు మరియు 3 మీటర్ల లోతు ఉండేలా ఒక గొయ్యి తవ్వండి. 20 x 30 సెంటీమీటర్ల మేర ఒక రంధ్రం ఉండేలా, ఆ గొయ్యి పైభాగం కప్పేయండి. స్థానికంగా లభించే నిర్మాణ సామగ్రితో ఆ గొయ్యి మీద గది నిర్మించి, కప్పు వేయండి. సురక్షితంగా ఉండటానికి, మరుగుదొడ్డిని ఇళ్ళు, బావులు, నీటి బుగ్గలు, నదులు లేదా ప్రవాహాలు లాంటి అన్నింటికీ కనీసం 20 మీటర్ల దూరంలో ఉండేలా నిర్మించండి. ప్రజలు నీటి కోసం వెళ్ళే ప్రదేశానికి సమీపంలో మరుగుదొడ్డి ఉంటే, అది ప్రవాహం దిగువన ఉండేలా నిర్మించండి. మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత, వాసన రావడం తగ్గించడానికి మరియు ఈగలు వాలకుండా చూడడం కోసం ఆ రంధ్రంలో కొద్దిగా సున్నం, మట్టి లేదా బూడిద పోయండి.

Sources
  • Audiopedia ID: tel010109