మంచి ఆహారాన్ని నేనెలా ఎంచుకోగలను

From Audiopedia
Jump to: navigation, search

కొన్నిసార్లు ఆహారం వండడానికి లేదా నిల్వ చేయడానికి ముందే చెడిపోయి ఉండవచ్చు. కాబట్టి, ఆహారం ఎంచుకునేటప్పుడు చూడాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ పేర్కొనబడ్డాయి.

తాజా (పచ్చి) ఆహారాలు ఈ విధంగా ఉండాలి:

  • తాజాగా మరియు ఆ సీజన్‌కి చెందినదిగా ఉండాలి.
  • పూర్తి స్థాయిలో ఉండాలి-గాయాలతో, దెబ్బలతో ఉండకూడదు లేదా కీటకాలు కొరికినవి కాకూడదు.
  • శుభ్రంగా ఉండాలి (మురికిగా ఉండకూడదు).
  • తాజా వాసనతో ఉండాలి (ప్రత్యేకించి చేపలు, షెల్ ఫిష్ మరియు మాంసం లాంటి వాటి నుండి ఘాటైన వాసన రాకూడదు).

ప్రాసెస్ చేసిన (వండిన లేదా ప్యాక్ చేసిన) ఆహారాలు ఇలా నిల్వ చేసి ఉండాలి: నిల్వ చేసిన డబ్బాలు కొత్తవిగా కనిపించాలి (తుప్పు పట్టి, ఉబ్బిపోయి లేదా సొట్టలు పడినవిగా ఉండకూడదు) జాడీల మూతలు శుభ్రంగా ఉండాలి. సీసాలు పెచ్చులూడినట్టు ఉండకూడదు. మొత్తం ప్యాకేజీ చిరిగిపోకుండా, పూర్తి స్థాయిలో ఉండాలి. క్యాన్లు నుండి చేపల వాసన వస్తుంటే, క్యాన్లు ఉబ్బిపోయి ఉంటే, లోపలి ఆహారం చెడిపోయిందని అర్థం.

Sources
  • Audiopedia ID: tel010121