పిల్లల కోసం సరైన పద్ధతిలో ఆహారం ఎలా తయారు చేయాలి

From Audiopedia
Jump to: navigation, search

శిశువులు మరియు చిన్న పిల్లల కోసం ఆహారం సిద్ధం చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వాళ్ల కోసం ఆహారం తాజాగా తయారు చేయాలి, వెంటనే తినిపించేయాలి. నిల్వ ఉంచకూడదు.

శిశువులు మరియు చిన్న పిల్లలకు తల్లి పాలు సురక్షితమైనది (మరియు అత్యంత పోషకాలు కలిగినది). తల్లి రొమ్ముల నుండి పిండిన పాలను గది ఉష్ణోగ్రత వద్ద శుభ్రమైన, మూత కలిగిన కంటైనర్‌లో ఎనిమిది గంటల వరకు నిల్వ చేయవచ్చు. పెద్ద పిల్లలకు జంతువుల పాలు ఇస్తుంటే, ఆ పాలను ఎప్పటికప్పుడు మరిగించాలి లేదా పాశ్చరైజ్ చేయాలి (హానికర బ్యాక్టీరియాను నాశనం చేయడానికి ఒక ప్రత్యేక పద్ధతిలో పాలను వేడి చేసే విధానం).

పచ్చిగా ఉండే లేదా మిగిలిపోయిన ఆహారం ప్రమాదకరం కావచ్చు. పచ్చి ఆహారాలు కడిగి లేదా ఉడికించి తినిపించాలి. ఉడికించిన ఆహారాన్ని ఆలస్యం చేయకుండా తినేయాలి లేదా తినడానికి ముందు పూర్తి స్థాయిలో వేడి చేయాలి. ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా (బర్డ్ ఫ్లూ) వ్యాప్తి నివారించడం కోసం అన్ని పౌల్ట్రీ మరియు పౌల్ట్రీ ఉత్పత్తులను పూర్తి స్థాయిలో ఉడికించాలి.

పండ్లు మరియు కూరగాయలకి తొక్క తీయాలి లేదా శుభ్రమైన నీటితో బాగా కడగాలి, ప్రత్యేకించి, చిన్న పిల్లలు వాటిని పచ్చిగా తింటుంటే, ఈ పని తప్పక చేయాలి. పండ్లు మరియు కూరగాయల మీద తరచుగా పురుగుమందులు మరియు కలుపు సంహారక రసాయనాలు చల్లుతారు కాబట్టి, అవి హానికరం కావచ్చు.

పచ్చి ఆహారాలు శుభ్రం చేయడం, కోయడం లాంటివి చేసిన తర్వాత చేతులను సబ్బు మరియు నీటితో కడుక్కోవాలి. పౌల్ట్రీ మరియు సముద్ర ఆహారాలు లాంటి పచ్చి మాంసాల్లో సూక్ష్మక్రిములు ఉంటాయి. వండిన ఆహార పదార్థాలకు పచ్చి ఆహార పదార్థాలు తగిలినప్పుడు సూక్ష్మక్రిములు వ్యాపించగలవు మరియు ఈ సూక్ష్మక్రిములు కొన్ని గంటల్లోనే ఆ వండిన ఆహారంలో సంతానోత్పత్తి చేయగలవు. పచ్చి మరియు వండిన ఆహారాలను ఎల్లప్పుడూ వేర్వేరుగా ఉంచాలి. పచ్చి ఆహార పదార్థాలను కోయడం, ముక్కలు చేయడం లాంటివి చేసిన తర్వాత కత్తులు, తరిగే పలకలు మరియు ఉపరితలాలను ఎల్లప్పుడూ సబ్బు మరియు నీటితో శుభ్రం చేయాలి.

Sources
  • Audiopedia ID: tel010124