పరిశుభ్రమైన తాగునీటిని నేనెలా పొందగలను
తాగే నీటిని మూతలతో ఉన్న జాడీల్లో నిల్వ చేయండి మరియు మీ నివాస స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోండి. సాధ్యమైనంత పరిశుభ్రమైన వనరు నుండి తాగునీరు తెచ్చుకోండి. నీరు మడ్డిగా ఉంటే, ఆ నీళ్లు తేరేవరకు నిరీక్షించండి మరియు శుభ్రమైన నీటిని మాత్రమే సేకరించండి. ఆతర్వాత, త్రాగడానికి ముందు, క్రింద వివరించిన విధానంలో నీటిలోని హానికర సూక్ష్మక్రిములను నాశనం చేయండి. దీనినే నీటి శుద్దీకరణ అని పిలుస్తారు.
శుద్దీకరించిన నీటిని శుభ్రమైన, మూతలు కలిగిన కంటైనర్లలో నిల్వ చేయండి. ఆ కంటైనర్లను అంతకుముందు వంటనూనె నిల్వ చేయడానికి ఉపయోగించి ఉంటే, వాటిని సబ్బు మరియు వేడి నీటితో బాగా కడగిన తర్వాతే, వాటిలో త్రాగునీళ్లు నిల్వ చేయండి. రసాయనాలు, పురుగుమందులు లేదా ఇంధనాల కోసం ఉపయోగించిన కంటైనర్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని నిల్వ చేయకండి. నీళ్లు నిల్వ చేసే కంటైనర్లను కనీసం వారానికి ఒకసారి సబ్బు మరియు శుభ్రమైన నీటితో కడగండి.