సూక్ష్మక్రిముల వ్యాప్తి ఆపడం ద్వారా, ఈ వ్యాధులను నిరోధించడానికి సమాజంలో పరిశుభ్రత (పారిశుద్ధ్యం), ఇంట్లో పరిశుభ్రత మరియు వ్యక్తిగత పరిశుభ్రత కీలకం.
ఉదాహరణకు:
పరాన్నజీవులు సోకడంతో, అతిసారం వచ్చిన ఒక పురుషుడు బయలు ప్రదేశంలో మల విసర్జన చేశాడు.
ఒక పంది ఆ వ్యక్తి మలం తినింది.
ఆ వ్యక్తి పిల్లల్లో ఒకరు ఆ పందితో ఆడుకుంటూ ఆ మలం ఒంటికి పూసుకున్నారు.
ఆ తర్వాత, ఆ పిల్లవాడు ఏడవడం ప్రారంభించాడు. తల్లి వచ్చి, పిల్లాడిని ఓదార్చి, చీర చెంగుతో పిల్లాడి చేతి వేళ్లు శుభ్రం చేసింది. ఆవిధంగా, ఆ మలం ఆమెకి కూడా అంటుకుంది.
పని ఒత్తిడిలో ఉన్న ఆ తల్లి చేతులు కడుక్కోకుండానే తన కుటుంబం కోసం ఆహారం సిద్ధం చేసింది. ఆసమయంలో, చేతులు కాలకుండా చీర చెంగుతో ఆమె పాత్రలు పట్టుకుంది. ఆ చెంగు శుభ్రంగా లేదని ఆమె మర్చిపోయింది.
ఆమె సిద్ధం చేసిన ఆహారాన్ని ఆ కుటుంబం మొత్తం తినింది. త్వరలోనే అందరికీ అతిసారం వచ్చింది.
క్రింది జాగ్రత్తల్లో ఏదో ఒకటి ఆ కుటుంబం పాటించి ఉంటే, వ్యాధి వ్యాప్తిని నిరోధించి ఉండవచ్చు:
ఆ పురుషుడు మరుగుదొడ్డి లేదా లెట్రిన్ ఉపయోగించి ఉంటే.
పంది స్వేచ్ఛగా తిరగకుండా చూసుకుని ఉంటే.
పిల్లాడి చేతులను ఆ తల్లి తన చీర చెంగుతో తుడవకుండా మరియు ఆ తర్వాత అదే చెంగుతో ఆహారం పట్టుకోకుండా ఉంటే.
ఆ తల్లి తన బిడ్డను తాకిన తర్వాత మరియు ఆహారం తయారుచేసే ముందు చేతులు కడుక్కుని ఉంటే.