నేను నా కళ్లు ఎలా రక్షించుకోవాలి
ఈగలు కారణంగా, సూక్ష్మక్రిములు వ్యాపిస్తాయి. ముఖం మురికిగా ఉన్నప్పుడు ఈగలు ఆకర్షితమవుతాయి, ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి సూక్ష్మక్రిములను వ్యాపింపజేస్తాయి. ప్రతిరోజూ సబ్బు మరియు నీటితో ముఖం మరియు చేతులు కడుక్కోవడమనేది కంటికి సోకే ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో, కంటి ఇన్ఫెక్షన్లు ట్రాకోమాకు దారితీయడంతో పాటు అంధత్వానికి కారణమవుతున్నాయి. కళ్లు నొప్పిగా ఉండడం లేదా ఇన్ఫెక్షన్ సోకితే, దృష్టి బలహీనపడవచ్చు లేదా కోల్పోవచ్చు. కళ్లు శుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఆరోగ్యంగా ఉండే కళ్లలో తెల్లటి భాగం స్పష్టంగా ఉంటుంది, కళ్ళు తేమగా మరియు మెరుపుతో ఉంటాయి మరియు దృష్టి చక్కగా ఉంటుంది. కళ్లు బాగా పొడిగా లేదా చాలా ఎర్రగా మరియు నొప్పితో ఉంటే, స్రావాలు వెలువడడం లేదా చూపు పరంగా ఇబ్బంది ఉంటే, వీలైనంత త్వరగా శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్త ద్వారా కళ్లను పరీక్షించుకోవాలి.