నేను క్రమం తప్పకుండా రొమ్ముల్ని ఎందుకు పరీక్షించుకోవాలి

From Audiopedia
Jump to: navigation, search

ఒక మహిళ ప్రతినెలా తన రొమ్ములను పరీక్షించుకోవాలి. నెలసరి శాశ్వతంగా ఆగిపోయిన తర్వాత కూడా ఆ విధంగా చేయాలి.

చాలామంది మహిళలకు రొమ్ముల్లో కొన్ని చిన్న చిన్న గడ్డలు ఉంటాయి. ఆమె రుతుచక్రం సమయంలో ఈ గడ్డలు తరచుగా పరిమాణంలోనూ మరియు ఆకారంలోనూ మారుతుంటాయి. మహిళకి నెలసరి రావడానికి ముందు అవి అత్యంత సున్నితంగా మారవచ్చు. అత్యంత తరచుగా కానప్పటికీ, కొన్నిసార్లు రొమ్ముల్లోని గడ్డ అనేది క్యాన్సర్‌కి సంకేతం కావచ్చు.

ఒక మహిళ తన రొమ్ములను ఎలా పరీక్షించుకోవాలో నేర్చుకుంటే, రొమ్ములోని గడ్డలను ఆమె స్వయంగా గుర్తించవచ్చు. నెలకు ఒకసారి ఆమె పరీక్షించుకుంటే, ఆమె తన రొమ్ములు తీరు గురించి అనుభూతి చెందడంతో పాటు ఏదైనా తేడా ఉన్నప్పుడు దాన్ని పసిగట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఒక మహిళ తన రొమ్ముల్ని స్వయంగా పరీక్షించుకోలేని స్థాయిలో వైకల్యంతో ఉంటే, తను విశ్వసించే ఎవరి సహాయంతోనైనా ఆ పని చేయవచ్చు.

Sources
  • Audiopedia ID: tel010211