నెలసరి రక్తస్రావం సమయంలో లైనింగ్‌ని బయటకు నెట్టడం కోసం గర్భాశయం పిండినట్టుగా అవుతుంది. ఇలా జరగడం వల్ల, పొత్తి కడుపు లేదా వెన్నెముక క్రింది భాగంలో నొప్పిగా అనిపించవచ్చు. దీనినే కొన్నిసార్లు తిమ్మిర్లు అని పిలుస్తారు. రక్తస్రావం ప్రారంభానికి ముందు లేదా ప్రారంభమైన వెంటనే ఈ నొప్పి ప్రారంభమవుతుంది.
ఏమి చేయాలి:
మీ పొత్తికడుపు మీద రుద్దండి. బిగదీసిన కండరాలు విశ్రాంతి పొందడానికి ఇది సహాయపడుతుంది.
ప్లాస్టిక్ బాటిల్ లేదా మరేదైనా కంటైనర్‌లో వేడినీళ్లు నింపి, దానిని మీ పొత్తికడుపు మీద లేదా వెన్నెముక క్రింది భాగంలో ఉంచండి. లేదా వేడి నీటిలో నానబెట్టిన మందమైన వస్త్రాన్ని ఆ ప్రదేశంలో పట్టీలాగా వేయండి.
మీ బొటనవేలు మరియు చూపుడు వేలు మధ్యలోని సున్నితమైన ప్రదేశంలో గట్టిగా నొక్కడం ద్వారా, చాలా రకాల నొప్పులు తగ్గించవచ్చు.
రాస్‌బెర్రీ ఆకులు, అల్లం లేదా చమోమిలేతో చేసిన టీ తాగండి. ఈ రకమైన నొప్పి నుండి ఉపశమనం కోసం ఉపయోగపడే ఇతర రకాల టీలు లేదా చిట్కాలు గురించి మీ సమాజంలోని మహిళలకు తెలిసి ఉండవచ్చు.
మీ రోజువారీ పనులు కొనసాగించండి.
వ్యాయామం చేయడానికి మరియు నడవడానికి ప్రయత్నించండి.
తేలికపాటి నొప్పి ఔషధం తీసుకోండి.
నెలసరి రక్తస్రావంతో వచ్చే నొప్పికి ఇబుప్రోఫెన్ చాలా బాగా పనిచేస్తుంది.
మీకు రక్తస్రావం తీవ్రంగా ఉండడంతో పాటు ఈ చిట్కాలేవీ పనిచేయకపోతే, తక్కువ మోతాదులోని గల గర్భనిరోధక మాత్రలు 6 నుండి 12 నెలల వరకు తీసుకోవడం వల్ల ఫలితం ఉండొచ్చు.