సాధారణంగా, నెలసరి రక్తస్రావం ప్రతి 21 నుండి 35 రోజులకు ఒకసారి కనిపిస్తుంది. ఒక నెలసరి తర్వాత, మరొక నెలసరికి మధ్య ఎక్కువ విరామం ఉండటం సాధారణమే కావచ్చు. కానీ, చాలా విరామం తర్వాత కూడా రాకపోతే, ఏదైనా సమస్య ఉండొచ్చు లేదా మీకు గర్భం వచ్చి ఉండొచ్చు.
ఈ అంశాలు కారణం కావచ్చు:
మీరు గర్భం దాల్చి ఉండొచ్చు.
మీకు గర్భస్రావం జరిగి ఉండొచ్చు.
అండాశయం నుండి అండం విడుదల కాకపోవడం.
మీకు మలేరియా, క్షయ లేదా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ లాంటి తీవ్రమైన అనారోగ్యం ఉండవచ్చు.
మీ వయసు 40 లేదా 45 ఏళ్లు దాటి ఉంటే, మీరు రుతువిరతికి దగ్గరవుతూ ఉండొచ్చు.
మాత్రలు, ఇంప్లాంట్లు మరియు ఇంజెక్షన్లు లాంటి కొన్ని కుటుంబ నియంత్రణ పద్ధతుల వల్ల కూడా -నెలసరి రక్తస్రావం ఆలస్యంగా కనిపించవచ్చు
పోషకాహారం లోపం వల్ల కూడా నెలసరి రక్తస్రావంలో మార్పులు ఉండొచ్చు.