STI సోకినప్పటికీ, చాలామంది మహిళలు మరియు చాలామంది పురుషుల్లో ఎలాంటి సంకేతాలు కనిపించవు.
అయితే, మీలో ఎలాంటి సంకేతాలు కనిపించనప్పటికీ, క్రింది పరిస్థితుల్లో మీకు ఆ ప్రమాదం (STI సోకే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు):
మీ భాగస్వామికి STI సంకేతాలు ఉంటే, మీకు సంకేతాలు లేనప్పటికీ, మీ భాగస్వామి ద్వారా మీకు ఇప్పటికే STI సోకి ఉండవచ్చు.
మీకు ఒకరి కంటే ఎక్కువమంది భాగస్వాములు ఉంటే. మీ భాగస్వాముల సంఖ్య పెరిగే కొద్దీ, వాళ్లలో ఎవరో ఒకరి వల్ల మీకు STI సంక్రమించే అవకాశం మీకు మరింతగా ఉంటుంది.
గత 3 నెలల్లో మీ జీవితంలోకి కొత్త భాగస్వామి వచ్చి ఉంటే. అతనికి అంతకుముందు ఉన్న భాగస్వామి ద్వారా STI సోకి ఉంటే, అది మీకూ సోకవచ్చు.
మీ భాగస్వామికి మీరు కాకుండా వేరొక భాగస్వామి ఉండవచ్చనని మీరు భావిస్తుంటే, (ఉదాహరణకు, మీ భాగస్వామి మీకు దూరంగా నివసిస్తుంటే). అంటే, అతనికి STI సోకడం వల్ల అది మీకు సంక్రమించే అవకాశం ఉందని అర్థం.