ఒకే కదలికను పదే పదే పునరావృతం చేయడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను నేనెలా నిరోధించగలను
From Audiopedia
మీరు పని చేస్తున్నప్పుడు చేతులు లేదా శరీర స్థానాలు మార్చడం మీకు సురక్షితంగా అనిపిస్తే, ఆవిధంగా చేయండి. కీళ్ళ మీద తక్కువ వంగుతూ, వాటిమీద తక్కువ ఒత్తిడి పడే విధంగా పని చేయడానికి ప్రయత్నించండి.
ప్రతి గంటకోసారి కీళ్లకి వ్యాయామం అందించే ప్రయత్నం చేయండి. అంటే, మీ కీళ్లను అవి కదలగల అన్ని దిశల్లో కదిలించండి. దీనివల్ల స్నాయువులు మరియు కండరాలు సాగుతాయి మరియు బలోపేతమవుతాయి. వ్యాయామం వల్ల నొప్పి వస్తుంటే, మీ కీళ్ళను నెమ్మదిగా మరియు సున్నితంగా కదిలించండి.