ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను నేనెలాలా నివారించగలను

From Audiopedia
Jump to: navigation, search

మీ విరామ సమయంలో చిన్నపాటి దూరం వరకు వేగంగా నడవండి. గదిలోనే అటూఇటూ నడవడానికి ప్రయత్నించండి లేదా కనీసం ప్రతి గంటకోసారి శరీరాన్ని సాగదీయండి.

వీలైతే, సపోర్ట్ కోసం సాక్స్ లేదా హోస్ ధరించండి. అవి మోకాలికి పైన ఉండాలి.

మీకు కాళ్లు బిగదీసినట్టు లేదా నొప్పిగా ఉన్నప్పుడల్లా లేదా ముందుకు వంగి కూర్చున్నప్పుడల్లా క్రింద పేర్కొన్న ప్రతి వ్యాయాయం చేయండి. నెమ్మదిగా, గాఢంగా శ్వాస తీసుకుంటూ, 2 లేదా 3 సార్లు వాటిని పునరావృతం చేయండి:

మీ తలని నెమ్మదిగా పూర్తి వృత్తాకారమంలో తిప్పండి. మీ భుజాలు పైకి క్రిందికి కదిలించండి, ముందుకు వెనుకకు తిప్పండి మరియు మీ భుజాలను మీ వెనక్కి లాగండి. అప్పుడు మీకు వీపు ఎగువ మరియు దిగువ ఉపశమనం అనుభవిస్తారు.

మీరు కూర్చుని పనిచేసే వారైతే:

  • మీ తల, మెడ మరియు భుజాలను నిటారుగా ఉంచే కుర్చీ ఉపయోగించండి. మీకు అనువుగా ఉంటే, మీ వీపు క్రింది భాగానికి మద్దతుగా చుట్టిన వస్త్రం లేదా దిండు ఉంచండి.
  • అవసరమైతే, మీరు మెరుగైన స్థితిలో పనిచేయడానికి వీలుగా మీ కుర్చీ లేదా టేబుల్ ఎత్తు సర్దుబాటు చేయండి. మీరు దిండు మీద కూర్చోవడానికి ప్రయత్నించవచ్చు లేదా బ్లాక్‌ల మీద తగిన ఎత్తులో మీ డెస్క్ లేదా టేబుల్ ఉంచవచ్చు.
  • మోకాళ్ల వద్ద మీ కాళ్ళను మడవకండి.
  • బిగుతైన దుస్తులు ధరించడం మానుకోండి.
Sources
  • Audiopedia ID: tel030116