ఇంట్లోని పరిశుభ్రత వ్యాధులను ఎలా నివారించగలదు

From Audiopedia
Jump to: navigation, search

కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉంటారు కాబట్టి, మొత్తం కుటుంబంలో సూక్ష్మక్రిములు మరియు అనారోగ్యం చాలా సులభంగా వ్యాపించగలదు.

ఒక కుటుంబంలో అనారోగ్యం తక్కువగా ఉండాలంటే, ఇలా చేయాలి:

  • వంట పాత్రలు మరియు తినే పాత్రలు మరియు ఇతర పాత్రలను సబ్బు (లేదా శుభ్రమైన బూడిద)తో కడగండి మరియు వాటిని ఉపయోగించిన తర్వాత శుభ్రమైన నీటితో కడగండి. వీలైతే, వాటిని ఎండలో ఆరబెట్టండి (అనారోగ్యం కలిగించే అనేక సూక్ష్మక్రిములను సూర్యరశ్మి చంపేస్తుంది).
  • నివసించే స్థలాన్ని తరచుగా శుభ్రం చేయండి. నేలలు, గోడలు మరియు ఫర్నిచర్ కింద శుభ్రం చేయండి మరియు కడగండి. బొద్దింకలు, నల్లులు మరియు తేళ్లు దాక్కునే అవకాశం ఉన్న నేలలోని లేదా గోడల్లోని పగుళ్లు మరియు రంధ్రాలు పూడ్చేయండి. పరుపుల్లోని పరాన్నజీవులు మరియు పురుగులు నాశనం చేయడం కోసం వాటిని ఎండలో వేలాడదీయండి లేదా పరచండి.
  • నేల మీద ఉమ్మకండి. మీకు దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు, మీ చేత్తో లేదా వస్త్రంతో లేదా రుమాలుతో మీ నోటిని కప్పుకోండి. ఆతర్వాత, వీలైతే, మీ చేతులు కడుక్కోండి.
  • శరీరం మీది వ్యర్థాలను సురక్షిత రీతిలో శుభ్రం చేసుకోండి. పిల్లలకు మరుగుదొడ్డి ఉపయోగించడం లేదా వారి మలాన్ని మట్టితో కప్పేయడం లేదా కనీసం ఇంటి నుండి లేదా ప్రజలు త్రాగునీటి కోసం ఉపయోగించే ప్రదేశాలకు దూరంగా మలవిసర్జన చేయడం నేర్పండి. పిల్లలు లేదా జంతువులు ఇంటి సమీపంలో మలవిసర్జన చేస్తే, వెంటనే దాన్ని శుభ్రం చేయండి.
Sources
  • Audiopedia ID: tel010110