విరిగిన గాజు ముక్కల వల్ల తీవ్రమైన కోతలు, రక్తం కోల్పోవడం మరియు ఇన్ఫెక్షన్ కలిగించే గాయాలు ఏర్పడవచ్చు. పదునైన లోహపు వస్తువులు, యంత్రాలు మరియు తుప్పు పట్టిన డబ్బాల కారణంగా, తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకవచ్చు. గాజు ముక్కలు మరియు పదునైన వస్తువుల కారణంగా పిల్లలకు గాయాలు కాకుండా కుటుంబాల్లో ఇలా చేయవచ్చు:
గాజు సీసాలను చిన్న పిల్లలకు దూరంగా ఉంచాలి. ఇల్లు మరియు ఆట స్థలంలో ఎక్కడా పగిలిన గాజు ముక్కలు లేకుండా చూడాలి.
కత్తులు, రేజర్లు మరియు కత్తెర్లను సొరుగుల్లో లేదా లాక్ చేసిన క్యాబినెట్లలో ఉంచడం ద్వారా, చిన్న పిల్లలకు వాటిని అందకుండా చూడాలి.
ఇంట్లో ఉండే పగిలిన సీసాలు మరియు పాత డబ్బాలు లాంటి చెత్తను సురక్షితంగా పారవేయాలి.
రాళ్లు లేదా ఇతర పదునైన వస్తువులు విసిరేయడం మరియు కత్తులు లేదా కత్తెర్లతో ఆడటం వల్ల కలిగే ప్రమాదాల గురించి పిల్లలకు తెలియజెప్పడం ద్వారా, ఇంటి పరిసరాల్లో పిల్లలకు తగిలే ఇతర గాయాలు నిరోధించవచ్చు.
ప్లాస్టిక్ సంచులు పిల్లలకు దూరంగా ఉంచాలి. వాటిని తలకు చుట్టుకున్నప్పుడు పిల్లలకు ఊపిరి ఆడని పరిస్థితి రావచ్చు.